హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: సారా దుకాణాలపై దాడులు: కల్తీ మద్యంపై కొరడాతో దుకాణదారుల్లో గుబులు 

Nagarkurnool: సారా దుకాణాలపై దాడులు: కల్తీ మద్యంపై కొరడాతో దుకాణదారుల్లో గుబులు 

ఆల్కాహాల్​

ఆల్కాహాల్​

జోగులాంబ గద్వాల జిల్లాలో మద్యం దుకాణాలపై ఆబ్కారీ శాఖ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సారాయి, కల్తీ లిక్కర్ అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen Kumar, News18, Nagarkurnool)

  జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో మద్యం దుకాణాలపై (Liquor shops) ఆబ్కారీ శాఖ అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సారాయి, కల్తీ లిక్కర్ అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. బెల్ట్ షాపుల (Liquor Belt Shops) ద్వారా కల్తీ మద్యం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఐజ పట్టణంలో ఓ ఇంటిలో అధికారులు దాడి చేయగా అక్రమంగా నిల్వఉంచిన సారాయిని స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. పలు దుకాణాల్లో మద్యం శాంపిళ్లు సేకరించి లిక్కర్ టెస్టు నిర్వహించారు. అధికారుల తనిఖీలతో మద్యం దుకాణదారుల్లో గుబులు మొదలైంది.

  గద్వాల జిల్లాలో సారాయి, కల్తీ మద్యం కట్టడి కోసమే దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ గోపాల్ తెలిపారు. వైన్ షాపుల (Wine shops) దగ్గర ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన తినుబండారాల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రంగపూర్ తండాలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పటేల్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి లక్ష్మి అనే మహిళ వద్ద నాటుసారా స్వాదీనం చేసుకొని ఆమెను విచారణ కోసం స్టేషన్లో అప్పగించారు. అనంతరం స్టేషన్ టీమ్, టాస్క్ ఫోర్స్ టీమ్ సంయుక్తంగా ఐజ పట్టణంలోని శివ, ఆర్ కే, శ్రీలక్ష్మి వైన్స్ షాపులను తనిఖీ చేశారు. అలాగే కొన్ని లిక్కర్ బాటిళ్లను డైలుషన్ టెస్ట్ చేశారు.

  అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పౌరసరఫరాల అధికారులు

  జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. కేటి దొడ్డి మండలానికి చెందిన రవి శుక్రవారం తెల్లవారుజామున అలంపూర్ మండలంలోని కల్వకుంట్ల నుంచి గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు మీదుగా 40 సంచుల రేషన్ బియ్యాన్ని వాహనంలో తరలిస్తున్నాడు. పక్కా సమాచారంతో గ్రామ శివారులో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. బియ్యం, వాహనంను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

  Rajanna Siricilla: గ్రామ శివారులో చిరుత పులి సంచారం: బిక్కుబిక్కుమంటున్న ఊరి జనం

  నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలో రేషన్ బియ్యాన్ని (Ration Rice) పట్టుకున్నట్టుగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్ బాబు తెలిపారు. ఒంగోలు మండలం రంగాపురంలో జయ రాఘవేంద్ర రైస్ మిల్లులో శుక్రవారం తనిఖీ చేయగా 62 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడడంతో యాజమాని బాలస్వామి పై కేసు నమోదు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వెల్దాండ మండలం అజిలాపూర్ గ్రామంలో రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయన్న సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. డీటీలు నరసింగరావు, రామ్మోహన్‌లు పోలీసుల సమక్షంలో 24 బస్టాండ్ వద్ద 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Gadwal, Local News, Nagarkurnool