హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఉమ్మడి పాలమూరుపై పట్టు కోసం బీజేపీ అగ్రనేతల వ్యూహాలు .. ఈటల ఇంటింటి ప్రచారం

Nagarkurnool: ఉమ్మడి పాలమూరుపై పట్టు కోసం బీజేపీ అగ్రనేతల వ్యూహాలు .. ఈటల ఇంటింటి ప్రచారం

MAHABUBNAGAR BJP

MAHABUBNAGAR BJP

Mahabubnagar: ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు తెలంగాణ బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. "జనం కోసం బీజేపీ భరోసా" పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంది. ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఈటెల రాజేందర్, బాబు మోహన్‌లకు భాద్యతలు అప్పగించింది బీజేపీ అధిష్ఠానం.

ఇంకా చదవండి ...

  (N.Naveen Kumar,News18,Nagarkurnool)

  నాగర్ కర్నూల్(Nagarkurnool)జిల్లాలో బీజేపీ (BJP)పట్టు బిగుస్తోందా? ఇప్పటికే కేంద్ర నాయకుల పర్యటనలు జిల్లా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందా? ఇటువంటి ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాపై పట్టు సాధించేందుకు తెలంగాణ బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. \"జనం కోసం బీజేపీ భరోసా\" పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంది. ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఈటల రాజేందర్(Etala Rajender), బాబు మోహన్‌(Babu Mohan)లకు భాద్యతలు అప్పగించింది బీజేపీ అధిష్ఠానం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో బీజేపీ పట్టు అంతంతరమాత్రంగానే ఉందని చెప్పాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్(TRS)ప్రభుత్వం పై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) రెండో విడత పాదయాత్రను 31 రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగించారు. ఈ పాదయాత్రతో జిల్లాలోని కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చాలా వరకు పార్టీ గ్రామాల్లోకి వెళ్లిందని అభిప్రాయం కలిగింది. ఈ క్రమంలోనే మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు బిజెపి వ్యూహ రచన చేస్తుంది. జనం కోసం బీజేపీ భరోసా పేరుతో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేపట్టింది. గ్రామీణ స్థాయి నుంచి పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుంది.

  Telangana : విద్యాంజలి కార్యక్రమంపై స్పందన కరువు .. ఆ జిల్లాల్లో శ్రీమంతులు ఎవరూ లేనట్లేగా..?  ఉమ్మడి పాలమూరుపై పట్టుకోసం..

  ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడతలో దేవరకద్ర, కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను దేవరకద్ర నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఈటెల రాజేందర్‌ను, కల్వకుర్తి నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. వీరి ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లోని గ్రామీణ స్థాయి నుంచి పలు కార్యక్రమాలను చేపట్టి ప్రతి ఇంటిలో కాషాయం జెండా ఎగిరేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామాల వారీగా పర్యటనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కల్వకుర్తి, దేవరకద్ర నియోజకవర్గంలో 8 రోజులు పాటు పార్టీ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ప్రజల్లో ఆపార్టీకి ఉన్న వ్యతిరేకతను అంచనా వేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.

  Komatireddy Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ వ్యూహకర్త చర్చలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మనసు మారుతుందా ?  ఇంటింటికి బీజేపీ ప్రచారం..

  కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇచ్చిన నిధులను, రాష్ట్రంలో అమలు చేస్తున్న జాతీయ పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయనున్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు... ఆసుపత్రి, పాఠశాలలో సౌకర్యాలు లేమీ వంటి సామాజిక సమస్యలను గుర్తించి టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టడం పై ఈ నేతలు దృష్టి సారించారు. ప్రజలు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలైన పింఛన్లు, సొంత ఇంటికల, ఆరోగ్య బీమా వంటి అంశాలపై ఫిర్యాదులను సేకరించి టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి ఆ గ్రామాలకు ఎలాంటి మౌలిక వసతులు కావాలో వివరాలను నమోదు చేసుకోనున్నారు. ఈ క్రమంలోని గ్రామీణ స్థాయిలో ప్రతి బూత్‌కి కార్యకర్తలను నియమించనున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Mahabubnagar, Telangana Politics

  ఉత్తమ కథలు