Home /News /telangana /

NAGAR KURNOOL ESTABLISHMENT OF A STATUE OF A MAN WHO SPENT HIS OWN MONEY FOR THE VILLAGE IN NAGAR KURNOOL DISTRICT SNR NNK NJ

Nagar kurnool:ఊరి పేరే ఆయన ఇంటి పేరైంది.. గ్రామం కోసం శ్రీమంతుడిగా మారాడు

(పాలెం

(పాలెం సుబ్బయ్య ఓ శ్రీమంతుడు)

Nagar Kurnool:ఆయనో నిస్వార్ధ సేవకుడు. అధికారాలు, పదవుల కోసం కాకుండా కేవలం గ్రామాభివృద్ధి కోసమే తన యావదాస్తిని ఖర్చు చేశారు. నాగర్‌ కర్నూలు జిల్లాలో పుట్టిన ఓ పెద్దమనిషి చివరకు తన ఇంటి పేరునే ఉరిపేరుగా మార్చుకున్నాడు. దత్తత తీసుకోకుండానే గ్రామస్తుల హృదయాల్లో శ్రీమంతుడిగా మారిపోయారు.

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagar Kurnool)
    Palem city: చిన్న పల్లెటూరుగా ఉన్న ఒక గ్రామాన్ని పట్టణంగా అభివృద్ధి చేసే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ రాజకీయాలకు అతీతంగా సొంత ఖర్చులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వారు మచ్చుకు ఒకరు కనిపిస్తూంటారు. అలా కోట్లలో ఒకరైన సంఘ సంస్కర్త నాగర్ కర్నూల్ (Nagar Kurnool)జిల్లాలో ఉన్నారు. ఆయనే పాలెం సుబ్బయ్య(Palam Subbayya)గా ప్రసిద్ధికెక్కిన తోటపల్లి సుబ్రమణ్యం(Thotapalli Subramaniam).

    ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు..
    నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జ్ణాపకార్థం ఆ ఊరి ప్రజలు విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాలెం సుబ్బయ్యను గొప్పగా స్మరించుకుంటున్నారు.

    సగం జీవితం సమాజసేవకే..
    పాలెం గ్రామంలో 1926 ఏప్రెల్ 24న జన్మించిన ఆయన 1986 జూన్ 23 మరణించారు. 60 ఏళ్ల పాటు జీవించిన పాలెం సుబ్బయ్య.. తన సగం జీవితం మొత్తాన్ని సమాజ సేవకు కేటాయించారు.

    ఊరు బాగుండాలని కోరుకున్న వ్యక్తి..
    వ్యవసాయం, పౌల్ట్రీ రంగంలో ఆదర్శ రైతుగా పలు అవార్డులు పొందిన ఆయన తన తెలివి తేటలతో అమితమైన సంపదను సొంతం చేసుకున్నాడు. తన సంపాదన తన గ్రామానికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో పాలెం గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి చిరస్థాయిగా నిలిచిపోయారు.

    1960 నుంచి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు:
    పాలెం గ్రామం వైపు ప్రపంచమంతా చూసేలా ఆయన సొంత ఖర్చులతో, సొంత భూమిని కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మొదటగా వైద్యాన్ని అందించేందుకు 1960లో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిని ప్రస్తుతంజిల్లా వైద్యాధికారి కార్యాలయంగా వినియోగిస్తున్నారు.1961లో తిరుమల తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి పాలెం గ్రామంలో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయ నిర్మాణంతో పాలెం గ్రామం దేవుని పాలెంగా పేరుగాంచింది. తీరితే తిరుపతి వెళ్లాలి తీరకపోతే పాలెం వెళ్లాలనే విధంగా పాలెం గ్రామం ప్రచారంలోకి వచ్చింది. ఆ తరువాత గ్రామంలో విద్యవ్యవస్ధ నెలకొనాలని విద్యార్థులు విద్య కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకూడదనే ఉద్దేశంలో గ్రామంలో 1962లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం 1963లో శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను నిర్మించారు.

    అన్నీ పనులకు ఆయన నిధులే..
    1965లో రక్షిత మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. 1965లోనే పోస్టాఫీసును దీనికి అనుబంధంగా 1967లో యూనియన్బ్యాంక్‌ను తీసుకువచ్చారు. 1967లో టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ను, 1968లో 40వేల కోళ్లతో పౌల్ట్రీని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారు.1975లో జిల్లాలో మొదటి సారిగా 60 ఇళ్లను నిర్మించి దళిత కాలనీని ఏర్పాటు చేశారు. వీటితో పాటు పాలెంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం దీనికి అనుబంధంగా వ్యవసాయ కళాశాలను తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు.

    విగ్రహం ఏర్పాటు చేసిన గ్రామస్థులు..
    పాలెం సుబ్బయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికి స్మరించుకుంటూ ఉండేలా పాలెం గ్రామస్థులు ఆయనకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సమీపంలో 1987లో ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ విగ్రహాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముద్ బేన్ జోషి ఆవిష్కరించారు.

    ఎలా వెళ్లాలి..?
    నాగర్‌కర్నూలు జిల్లాకేంద్రానికి 11కిలోమీటర్ల దూరంలో ఈ పాలెం ఉంది. ఇక్కడికి బస్సు, ఇతర ప్రైవేటు ట్రావెల్స్ సదుపాయం ఉన్నాయి.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు