(N.Naveen Kumar,News18,Nagarkurnool)
నాగర్ కర్నూల్ (Nagarkurnool)జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు కీలక ప్రకటనలు జారీ చేశారు. ఈ ఏడాది జిల్లాలో విద్యార్థులకు ఎలాంటి విహారయాత్ర (Vacation)చేపట్టేందుకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు. విహారయాత్ర తో పాటు విజ్ఞాన యాత్ర(Science trip)లు కూడా చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవని స్పష్టంగా తెలియజేశారు. ఈ నిబంధనలను అధిగమించినా అతిక్రమించి ఏ ఉపాధ్యాయుడైన విద్యార్థులను విహారయాత్రలకు తీసుకువెళ్తే శాఖపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
పంతుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విహారయాత్రలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదని డిఈఓ గోవిందరాజులు తెలిపారు.విద్యార్థుల భద్రతతో చెలగాటమాడుతూ ఎలాంటి అనుమతి లేకుండా ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకుని విహారయాత్రలకు వెళితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను విహారయాత్రలకు పంపకూడదన్నారు.ఇతర జిల్లాల్లో విహారయాత్రలకు వెళ్లిన కొన్ని సంఘటనలను పున: పరిశీలించుకోవాలన్నారు.ఎవరైనా అతిక్రమించి వెళ్తే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని డిఈఓ గోవిందరాజులుహెచ్చరించారు.
విహారయాత్రలు బంద్..
పాఠశాల విద్యార్థులకు విహారయాత్రలు ఒక ఆహ్లాదకరమైన సంఘటన. ఒక తీపి గుర్తుగా వారి జీవితంలో మిగిలిపోతుంది. పాఠశాల విద్యార్థులను విహారయాత్రలకు కానీ విజ్ఞాన యాత్రలకు కానీ తీసుకువెళ్లడం ద్వారా ఒక కొత్త ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక ప్రాంతాన్ని వారికి చూపించినట్టుగా ఉంటుంది. ఈ పర్యటనల ద్వారా విద్యార్థులు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. కొత్త వాతావరణాలను కొత్త ప్రదేశాలను చూసి ఎంతో ఆహ్లాదాన్ని పొందుతారు. ఇందుకోసమే ప్రభుత్వం చాలా కాలంగా విద్యార్థులను విహారయాత్రలకు తీసుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ వచ్చింది.
ప్రమాదాల వల్లే కఠిన నిర్ణయం..
అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి విహార యాత్రలకు వెళ్లిన విద్యార్థులు తరచూ ప్రమాదాలకు గురి కావడం, అనారోగ్యాల పాలు గురికావడం, మరణాలు చెందడం వంటివి సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల భద్రత వారిని ప్రాణాలు కాపాడమే ముఖ్య లక్ష్యంగా ఆలోచించి ప్రభుత్వం ఈమెరకు నిర్ణయం తీసుకుందని డివో గోవిందరాజులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నిబంధనలను ఎవరు అధికమించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈసారి ఈ విధంగా..
దీంతో విద్యార్థులకు ఈ ఏడాది కూడా విహారయాత్ర వెళ్లే అవకాశం లేకుండా పోయిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ విద్యార్థుల భద్రత వారిని క్షేమంగా చూసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కొంతమంది అధ్యాపకులు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana News