హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: రూ. కోటికి పైగా కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.., ఆ డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

Nagarkurnool: రూ. కోటికి పైగా కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.., ఆ డబ్బులను ఏం చేస్తారో తెలుసా?

కల్వకుర్తిలో

కల్వకుర్తిలో అమ్మవారికి కోటి రూపాయలతో అలంకారం

దసరా పండుగ (Dusserha Festival) సందర్భంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రి (Devinavarathri Utsav) ఉత్సవాలలో భక్తులు ఆ ఆది పరాశక్తిని ఎంతో నియమనిష్టలతో కొలుస్తారు. అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  దసరా పండుగ (Dusserha Festival) సందర్భంగా కొనసాగుతున్న దేవీ నవరాత్రి (Devinavarathri Utsav) ఉత్సవాలలో భక్తులు ఆ ఆది పరాశక్తిని ఎంతో నియమనిష్టలతో కొలుస్తారు. అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా తొమ్మిది రూపాల్లో ఉండే అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలుసమర్పిస్తుంటారు. ఈ క్రమంలో శనివారం లక్ష్మీదేవి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో ప్రత్యేకంగా పూజ నిర్వహించారు. కల్వకుర్తిలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కొలువుదీరిన అమ్మవారికి రూ. కోటి 11 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరణలు చేపట్టారు. పూల తోరణాలను మించి ఆకట్టుకున్న కరెన్సీ తోరణాల నడుమ శక్తిస్వరూపిణీని చూసేందుకు కల్వకుర్తి పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

  కల్వకుర్తి కన్యకాపరమేశ్వరి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో రూ. ఒక కోటి 11 లక్షల రూపాయలను ఆలయ కమిటీ సభ్యులు వసూలు చేసి అమ్మవారిని అలంకరించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆదివారం నాడు ఎవరి డబ్బులు వారికి తిరిగి పంచిపెట్టినట్లు సభ్యులు తెలిపారు. కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కల్వకుర్తిలో గత 20 సంవత్సరాలుగా కమిటీలను ఏర్పాటు చేసుకొని శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ బాబు చెప్పుకొచ్చారు. 9 రోజులపాటు ప్రత్యేక పూజలు ప్రత్యేక అన్న ప్రసాదాలు వంటి కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అలంకరణ చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారని వివరించారు.

  ఇది చదవండి: గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన 'మిడ్ వైఫరీ'..! ఏమిటిది?

  భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారికి సేవలు చేసుకోవడం వలన సంస్థ లోకాన్ని జగన్మాత కాపాడుకుంటుందని వివరించారు. శరన్నవరాత్రులు ముగిసే వరకు ప్రతిరోజు కూడా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే వీటితో పాటు అమ్మవారి మహిమను, గొప్పతనాన్ని, దసరా చరిత్రను తెలిసే విధంగా ఆటపాటలతో భజన కీర్తనలు నాటక ప్రదర్శనలు కూడా చేపట్టి భక్తులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు