Home /News /telangana /

NAGAR KURNOOL DURIN VECHICLE CHEKCING IN VELDANDA LIMITS POLICE CAUGHT ILLEGALLY TRANSPORTING ZILETIN STICKS ABH BRV NNK

Nagarkurnool: భారీగా జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను పట్టుకున్న పోలీసులు ..

భారీగా జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను పట్టుకున్న పోలీసులు

భారీగా జిలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లను పట్టుకున్న పోలీసులు

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. తండ్రి తిడతాడని బాలుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో చోటుచేసుకుంది

ఇంకా చదవండి ...
  (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

  నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్ బాక్సులను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందిన యానాల పాండురంగారెడ్డి అనే వ్యక్తి బొలెరో వాహనంలో 460 జిలిటిన్ స్టిక్స్, 20 బాక్సుల డిటొనేటర్లను తీసుకువెళ్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పై పెద్దాపురం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పాండురంగారెడ్డి వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. జిలిటిన్ స్టిక్స్, డిటొనేటర్ల తరలింపుకు సంబంధించి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంపై పోలీసులు ఆరా తీశారు. వెల్డండా మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కొండల్, రేవెల్లి గ్రామానికి చెందిన శివకు సరఫరా చేసేందుకు తీసుకొని వెళుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఎస్ఐ నరసింహులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం:
  నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఏల్లూరు గ్రామ సమీపంలో జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి పనుల్లో శుక్రవారం ఉదయం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్యాకేజీ వన్‌లో పనులు జరుగుతుండగా 1200 మందికి పైగా బీహార్, ఝార్ఖండ్ చెందిన కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. క్రేన్ సాయంతో మిల్లర్లను కిందికి దిగుతుండగా ఒక్కసారిగా ట్రైన్ రోప్ తెగిపోయి కార్మికులపై పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు కార్మికులు మృతి చెందారు. గాయపడిన కొందరిని మహబూబ్‌నగర్ జనరల్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రాజెక్టులో జరిగిన ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

  తండ్రి తిడతాడని యువకుడుఆత్మహత్య చేసుకున్న ఘటన జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు రాజోలికి చెందిన కురువ రామకృష్ణకు కుమారుడు సురేష్, కుమార్తె ఉన్నారు. కుమార్తె కర్నూలు జిల్లా కుషాపూర్ గ్రామంలో నివసిస్తుండగా... ఆమెను చూసేందుకు రామకృష్ణ కుషాపూర్ వెళ్ళాడు. ఈక్రమంలో సురేష్ (17) తన తల్లి సుజాతతో కలిసి పొలం పనులకు వెళ్ళాడు. సాయంత్రం సమయంలో తల్లీని వెంటబెట్టుకుని ఎడ్ల బండిపై తిరిగి వస్తున్నాడు. ఎద్దులను అదుపు చేయబోగా అవి బెదిరి కింద పడ్డాయి. ఎద్దులు కుప్పకూలడంతో వాటికీ గాయాలు అయ్యాయి. దీంతో తన తండ్రి వచ్చాక తిడతాడని భయాందోళనకు గురయ్యాడు సురేష్. ఈక్రమంలో ఇంటికి వచ్చిన సురేష్ చిన్నాన్న తిమ్మప్ప... ఎద్దులు ఎలా కింద పడ్డాయని, వాటికి దెబ్బలు ఎందుకు తగిలాయని ప్రశ్నిస్తుండగా ఎలాంటి సమాధానం చెప్పకుండా కూర్చున్నాడు. దీంతో సురేష్ దగ్గరికి వెళ్లిన తిమ్మప్ప అప్పటికే యువకుడు పురుగుల మందు తాగినట్లు గుర్తించాడు. వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు