హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఈ ఆవుపాలు తాగితే మోకాళ్ల నొప్పులు మటుమాయం.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

ఈ ఆవుపాలు తాగితే మోకాళ్ల నొప్పులు మటుమాయం.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

ఆవుపాలతో

ఆవుపాలతో మోకాళ్ల నొప్పులకు చెక్

ఆవు పాల నుంచి వ్యర్ధాల వరకు అన్ని మనకు ఏదో విధంగా ఉపయోగపడేవే. ముఖ్యంగా చిన్నారులు ఆవు పాలు తాగడం వలన కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు. ఈ విషయాన్నీ బాగా అర్ధం చేసుకున్న నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు గుజరాత్ రాష్ట్రానికి చెందినగిర్ జాతి ఆవును తీసుకు వచ్చి పోషణ చేస్తున్నాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagar Kurnool

  అ.. అమ్మ, ఆ.. ఆవు! అంటూ అక్షరమాలలో అమ్మ తరువాతి స్థానాన్ని ఆవుకి ఇచ్చారు. చిన్ననాటి నుంచే పిల్లలకు ఆవు ప్రాముఖ్యత తెలిసేలా పాఠాల ద్వారా బోధించేవారు. ఆవు పాల నుంచి వ్యర్ధాల వరకు అన్ని మనకు ఏదో విధంగా ఉపయోగపడేవే. ముఖ్యంగా చిన్నారులు ఆవు పాలు తాగడం వలన కలిగే లాభాలు అన్నీఇన్నీ కావు. ఈ విషయాన్నీ బాగా అర్ధం చేసుకున్న నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు గుజరాత్ రాష్ట్రానికి చెందినగిర్ జాతి ఆవును తీసుకు వచ్చి పోషణ చేస్తున్నాడు. ఈ ఆవు ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆవు పాలు తాగిన వారికి మోకాళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులు చాలా వరకు తగ్గిపోతాయని నమ్మకం. ఇది సాంకేతికంగానూ నిర్ధారణ అయిందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈజాతి ఆవు పాలలో కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం.

  నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన అమీర్ రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. కరోనా తర్వాత నష్టాలు రావడంతో డ్రైవర్ వృత్తి మానేసి సొంత గ్రామం వడ్డెమానులో 'జై శ్రీమన్నారాయణ డైరీ ఫార్ములా' పేరుతో పాల దుకాణం నిర్వహించసాగాడు. అమీర్ నాలుగు గేదలు, నాలుగు ఆవులతో ఈ డైరీ ఫామ్ ప్రారంభించి గ్రామంలో రోజుకు 300 లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి నెలకొల్పిన 'సమతా మూర్తి ఆశ్రమం'లో గిర్ జాతి ఆవులను చూసి ఈ ఆవులను తాను కూడా పెంచాలని అనుకున్నాడు. అప్పటికే కొత్తరకం ఆవులు తీసుకురావాలని ఆలోచనతో ఉన్న అమీర్ గుజరాత్‌కు చెందిన గిర్ రకం ఆవును తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.

  ఇది చదవండి: నోరూరించే చికెన్ సాంబర్ తినాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే.., వెరైటీ రుచులతో ఆకర్షిస్తున్న హోటల్

  హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన ఏజెంట్ ద్వారా ఆవును గుజరాత్ నుంచి తెప్పించి గ్రామానికి తీసుకువచ్చాడు. ఇందుకోసం రూ. 1,50,000 వరకు ఖర్చు వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ ఆవు పాలను తాగిన వారిలో ఎలాంటి ఎముకల నొప్పులు ఉండవని చెప్పడంతో స్థానిక గ్రామస్తులు ఈ పాలను తాగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఈ రకం ఆవు పాలకు లీటర్ రూ. 150 వరకు ఉండగా, వడ్డేమాన్ గ్రామంలో లీటరు రూ.100 వరకు అమ్ముతున్నట్లు అమీర్ తెలిపాడు. ఈ ఆవును తీసుకొచ్చిన పది రోజుల్లోనే ఈనడంతో ఒక ఆడ దూడ, ఒక మగ దూడకు జన్మనిచ్చింది.

  ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటూ ఇప్పుడిప్పుడే ఆరోగ్యవంతంగా తయారవుతున్నాయని అమీరు చెప్పాడు. ఈ ఆవుల పోషణకు రోజుకు రూ. 200 వరకు ఖర్చు వస్తుందని వివరించాడు. దూడలు ఎక్కువగా పాలు తాగడం వలన తాను పాలను ఎక్కువగా పితకడం లేదని వివరించాడు. ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు మొత్తం ఎనిమిది లీటర్ల వరకు రోజుకు పాలను అందిస్తుందని వివరించారు. ఈ ఆవులను ప్రత్యేక షెడ్ నిర్మాణం చేసి జాగ్రత్తగా పోషిస్తున్నట్లు తెలిపారు. పాల వ్యాపారి అమీర్ ఫోన్ నెంబర్ 9032115558

  Published by:Purna Chandra
  First published:

  Tags: Cow milk, Local News, Nagarkarnol district, Telangana

  ఉత్తమ కథలు