Naveen Kumar, News18, Nagarkurnool
తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం 8 మెడికల్ కాలేజ్ ప్రారంభించింది. సీఎం కేసీఆర్ (CM KCR) ఒకేరోజు వర్చువల్ ద్వారా ఈ కళాశాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఉద్దేశంతో ఈ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలకు అనుబంధంగా నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలోని ఆసుపత్రిని అభివృద్ధి చేసి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవితో న్యూస్ 18 ప్రత్యేక ఇంటర్వ్యూ చేపట్టింది. కళాశాలలో ఏర్పాట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో అన్ని సదుపాయాలను కల్పించిన తర్వాతనే తరగతులను ప్రారంభించామని ప్రిన్సిపల్ వివరించారు. మొదటి కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు 30 మంది స్టూడెంట్స్ తమ కళాశాలలో చేరి క్లాస్ లకు హాజరవుతున్నారని తెలిపారు. ఇంకా 90 మంది వరకు విద్యార్థులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ (December) 1 నాటికి అన్ని కౌన్సిలింగ్ లో పూర్తయిన తర్వాత పూర్తిగా సీట్లు భర్తీ అవుతాయని చెప్పారు.
అయితే కళాశాలలో నిబంధనలను ప్రకారం సకల ఏర్పాట్లను కల్పించామని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఫ్యాకల్టీని కానీ టీచింగ్ సిబ్బందిని నియమించామని తెలిపారు. ఉస్మానియా మెడికల్ కళాశాల (Usmania Medical College) లో అనుభవం పొందిన ఉపాధ్యాయులచే తరగతులు భోదిస్తున్నామని చెప్పారు. కొత్త టెక్నాలజీతో డిజిటల్ ద్వారా క్లాస్‌లను బోధిస్తున్నామని చెప్పుకొచ్చారు. నాగర్ కర్నూల్ లోని మెడికల్ కళాశాలకు హైదరాబాద్ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా సీటును సాధించగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా వస్తున్నారని వివరించారు.
పూర్తిగా సీట్లు భర్తీ అయిన తర్వాత విద్యార్థులు హాజరైన తర్వాత ఎంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు... ఎంతమంది పట్టణ ప్రాంతాల నుంచి వచ్చారని అంశాలు స్పష్టత వస్తుందని ప్రిన్సిపల్ రమాదేవి చెప్పుకొచ్చారు. కొత్త కాలేజీలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో అని సందేహించిన తమకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కళాశాలలో చేరిన విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కళాశాలలోని ఉపాధ్యాయులు ఎంతో అనుభవం కలిగిన వారు ఉండటం తమకు సంతోషం కలిగిస్తుందని చెప్పారు. ఏర్పాట్లు అన్నీ కూడా తమకు సౌకర్యవంతంగా ఉన్నాయని నూతన ఉత్తేజం వస్తుందని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఫ్యాకల్టీ విషయంలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించడం కళాశాలకు అవసరమైన సిబ్బందిని నియమించడం వంటి కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తిచేసి కళాశాలను ప్రారంభించామని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana