హోమ్ /వార్తలు /తెలంగాణ /

Double Bedroom Houses: పేదలకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో సిద్ధమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..

Double Bedroom Houses: పేదలకు గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో సిద్ధమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..

X
double

double bedroom

తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bedroom Houses) ప్రధానమైనవి. పేద ప్రజలకు ఉపయోగపడే అంశం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చాలావరకు రాష్ట్రంలో నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు అందించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఇచ్చిన హామీల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు (Double Bedroom Houses) ప్రధానమైనవి. పేద ప్రజలకు ఉపయోగపడే అంశం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చాలావరకు రాష్ట్రంలో నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏర్పాటు చేసి అర్హులైన పేదలకు అందించారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool) లో ఇప్పటివరకు ఎక్కువగా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చిన హామీను ఇప్పటివరకు నెరవేర్చలేదని చాలామంది ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే చాలామంది అర్హులు కూడా ఈ డబుల్ బెడ్లకు ఎదురుచూస్తున్నారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక కల. ఆ కలను ప్రభుత్వం నెరవేర్చుతుందని ఆశతో చాలామంది లబ్ధిదారులు ఎదురు చేస్తున్నారు. చాలా వరకు రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు అని ఏర్పాట్లను చేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం వారికి ఇండ్లను కేటాయించడం వంటి ప్రక్రియను చేపట్టారు. అయితే ప్రభుత్వ నిబంధనలను ప్రకారం తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ ఇండ్లను ప్రారంభించేందుకు లబ్ధిదారులకు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మిషన్ భగీరథ, విద్యుత్ మౌలికవస్థలను కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టరు. త్వరలోనే నియోజకవర్గల వారిగా ఇండ్లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇది చదవండి: ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్

ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారుల ఎంపిక పంపిణీపై అధికారులతో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 781 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కావలసిన విద్యుదీకరణ, మిషన్ భగీరథ, మౌలిక వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పట్టణ ప్రాంతంలో 582 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి కాగా, గ్రామీణ ప్రాంతంలో 199 ఇండ్లనుఅధికారులు పూర్తి చేశారు. వీటిలోనాగర్ కర్నూల్ పట్టణంలో 192, అచ్చంపేట పట్టణంలో 150, కల్వకుర్తి పట్టణంలో 240 ఇండ్లు ఉన్నాయి.గ్రామీణ ప్రాంతంలోని పెద్ద ముద్దునూరులో30, గన్యాగులలో 25, వనపట్లలో 20, ఇంద్రకల్ లో20, తాడూర్లో 104 ఉన్నాయిరాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటూ దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి వారికే కేటాయించనున్నారు.

First published:

Tags: Double bedroom houses, Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు