హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ తిరుమల ఈ ఆలయం.. ఏడు కొండలపై కొలువైన వెంకన్న.. చరిత్ర ఇదే..!

తెలంగాణ తిరుమల ఈ ఆలయం.. ఏడు కొండలపై కొలువైన వెంకన్న.. చరిత్ర ఇదే..!

బ్రహ్మోత్సవాలకు ముస్తాబయిన మన్యం కొండ

బ్రహ్మోత్సవాలకు ముస్తాబయిన మన్యం కొండ

మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar) లో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. తిరుపతి (Tirupati) క్షేత్రంలో శ్రీవారి ఆలయం ఏ విధంగా కొలువైందో అలాంటి పోలికలతోనే మన్యంకొండలో స్వామివారి ఆలయం కొలువై ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar) లో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ధర్మకర్తలు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. తిరుపతి (Tirupati) క్షేత్రంలో శ్రీవారి ఆలయం ఏ విధంగా కొలువైందో అలాంటి పోలికలతోనే మన్యంకొండలో స్వామివారి ఆలయం కొలువై ఉంది. తిరుమల (Tirumala) లో ఏడుకొండలు ఏ విధంగా ఉన్నాయో ఈ ఆలయం చుట్టూ కూడా ఏడుకొండలు కొలువుతీరి ఉన్నాయి. తిరుమలకు చాలా దగ్గర పోలికలు ఉండడంతో ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా భక్తులు కొనియాడుతారు. తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకోలేని భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకొని తలనీలాలు సమర్పించి తమ కోరికలు నెరవేరాలంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఆసన్నమయ్యాయి. ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు ప్రభుత్వాధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కలియుగ వైకుంఠంగా భావిస్తున్న తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఇంతటి విశిష్ట గల మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 31 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఫిబ్రవరి 5న రాత్రి చేపట్టనున్నారు. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రైచూర్ అంతరాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరిఉంది. స్టేజి నుంచి మూడు కిలోమీటర్ల మేర ఘాట్ గుండా ప్రయాణం చేస్తే స్వామి వారి దేవస్థానంను చేరుకోవచ్చు.ఎంతో చరిత్ర గల దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట ఇలవేల్పు దైవంగా మారింది. తవ్వని కోనేరు, చక్కని పాదాలు ముద్రలు ఈ ఆలయ విశిష్టత. ఈ క్షేత్రానికి సంబంధించిన ఉత్సవాల్లోనే దాదాపు లక్షకుపైగా భక్తులు దర్శించుకుని తరిస్తారు.

ఇది చదవండి: ఎదురు పిల్ల పండుగ..! పేరులాగే పండగ కూడా చాలా డిఫరెంట్.. ఎక్కడంటే..!

ప్రతి ఏడాది స్వామివారికి భక్తుల నుంచి దాదాపు కోటికిపైగా ఆదాయం వస్తుంటుంది. అలహరి వంశానికి చెందిన హనుమద్దాసు వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గణించింది. చాలా కాలం పాటు ఆగిపోయిన స్వామి పూజలు మళ్ళీ హనుమద్దాసు వలన ప్రారంభమయ్యాయి. హనుమద్దాసు వారు మళ్లీ పూజలు ప్రారంభించి స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు అప్పట్లో అందరిని ఆకట్టుకున్నాయి. దేవస్థానం చరిత్ర చాటి చెప్పాయి. హనుమద్దాసు కృషిని తెలుసుకున్న గద్వాల, వనపర్తి సంస్థానాదీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ఉత్సవాలకు తమ వంతు ధర్మంగా విరాళాలు అందించారు.ఉత్సవాల్లో తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యంకొండకు వచ్చి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించే వారు.

ఇది చదవండి: ఈమెవన్నీ పాతకాలం నాటి పద్ధతులే.. లైఫ్ స్టైల్ కి దండం పెట్టాల్సిందే..!

ఏనుగులతో స్వామివారికి సేవా కార్యక్రమాలు చేపట్టి స్వామి వారికి సేవలు చేసేవారు.స్వామి వారు నిజంగానే కొలువై ఉన్నారని చెప్పి అనేక కీర్తనలు పడేవారు.అప్పట్లో ఆయన దేవస్థానం వద్ద కోనేరు తవ్వించడంతోపాటు పెద్ద గుడి గుట్ట గంటను కూడా ఏర్పాటు చేశారు. ఆ గంట ఇప్పటికి చైర్మన్ గదిలో పక్కన కనిపిస్తుంది. హనుమద్దాసు తరువాత ఆయన వంశానికి చెందిన అలహరి రామయ్య దేవస్థానం సేవలు చేపట్టారు.వంశపార్యపర్యంగా ధర్మకర్తగా ఉండడంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. స్వామివారి సేవలో అలహరి వంశీయులు చేసిన కృషిఎంతో ఉంది.వారిలో ఆలహరి అనంతయ్య, కేశవయ్య, రంగయ్య, వెంకయ్య, పాపయ్య,హనుమద్దాసు, మీగయ్య, అనంతయ్య, రామయ్య, వెంకటస్వామి, నారాయణస్వామి ఉన్నారు. ప్రస్తుతం అదే వంశానికి చెందిన అలహరి మధుసూదన్ కుమార్ వంశపారపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు.

ఇది చదవండి: పులిలాంటి కుక్క..ఈ రైతు ఐడియా అదుర్స్ కదూ!

దేవస్థాన స్థాపనకు కృషిచేసిన అలహరి వంశీయులు చెప్పే చిత్రపటం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. కొంతమంది ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ మన్యంకొండ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 31న ప్రారంభం కానున్నాయి.మొదటి రోజు మన్యంకొండసమీపంలో కోట కదిరిలో అలహరి వంశీయులు ఇంటి నుంచి స్వామివారిని గుట్టపైకి ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు. అదే రోజు స్వామివారి తిరుచ్చి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1న హంస వాహన సేవ రెండున గజా వాహన సేవ, మూడున సూర్యప్రభల వాహన సేవ, నాలుగున హనుమాన్ వాహన సేవ,ఐదున గరుడ వాహన సేవ, అర్థ రాత్రి తరువాత రథోత్సవం, ఆరున అశ్వవాహన సేవ, ద్వితీయ ప్రభోత్సవాల్లో ఏడున శేష వాహన సేవ, స్వామి వారి దర్బార్ సేవ, 11న శేష వాహన సేవ, 18న శివరాత్రితో పాటు సంగీత సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుపతికి మన్యంకొండకు చాలా దగ్గర పోలికలు ఉండడంతో తెలంగాణ తిరుపతిగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యమని లభిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. తిరుపతిలో ఏడుకొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే మన్యంకొండలో కూడా దేవస్థానం చుట్టూ ఏడుకొండలు ఉన్నాయి. అంతే కాకుండా ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు