Home /News /telangana /

Nallamala Tourism: నల్లమల టూరిజం ప్యాకేజీ.. పెద్ద పులులతో పాటు.. నల్లమల అందాలను చూసే విధంగా ఏర్పాట్లు..

Nallamala Tourism: నల్లమల టూరిజం ప్యాకేజీ.. పెద్ద పులులతో పాటు.. నల్లమల అందాలను చూసే విధంగా ఏర్పాట్లు..

టూరిజం వద్ద భద్రతా సిబ్బంది

టూరిజం వద్ద భద్రతా సిబ్బంది

Nallamala Tourism: ఇద్దరికీ రూ 4వేలు ఆరుగురికి 9 వేలు చొప్పున అడవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 12 మంది మాత్రమే టూరిజం ప్యాకేజీ ద్వారా నల్లమల అందాలను తిలకించేందుకు ఏర్పాటు చేశారు. నేటి నుంచి అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...
  (S.Rafi,News18,Mahabubnagar)

  ఇద్దరికీ రూ 4వేలు ఆరుగురికి 9 వేలు చొప్పున అడవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం రోజుకు 12 మంది మాత్రమే టూరిజం ప్యాకేజీ ద్వారా నల్లమల అందాలను తిలకించేందుకు ఏర్పాటు చేశారు. ప్రకృతి అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు అలాంటి నేచర్ ను కాపాడుతూ వన్య ప్రాణాల మనుగడకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఈ క్రమంలో లో దేశంలో నే రెండో అతిపెద్ద రిజర్వ్ టైగర్ అడవి ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లోని ని అడవులను అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ (ఏ టి ర్) ఇంకా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అడవులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా పర్యాటకుల కోసం నల్లమలలో విహార యాత్రలకు అనుమతిచ్చింది. ఇందుకు టూరిజం కోసం ప్రత్యేక ప్యాకేజీ సైతం ప్రవేశపెట్టింది. నేటి నుంచి అందుబాటులోకి రానుంది.

  Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


  టూరిజం ప్యాకేజీ శ్రీకారం..
  నల్లమల్ల అడవులు అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ గా పిలువబడుతుంది. ఈ అడవుల్లో నిక్షిప్తమైన పర్యాటక అందాలను ప్రకృతి ప్రియులకు ఆస్వాదించేందుకు నాగర్ కర్నూల్ జిల్లా అడవి శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ప్రయోగాత్మకంగా ఫరహాబాద్ టూర్ పేరుతో ప్రత్యేకమైన నల్లమల్ల ప్రకృతి అందాల ఏ టి ఆర్ టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తెస్తున్నారు..

  డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


  ఆర్డర్ పై భోజనం..
  యాత్రికులకు భోజన సదుపాయాన్ని ఆర్డర్ పై మృగ వాణి రిసార్ట్స్ నుంచి తాత్కాలికంగా అందజేసేందుకు ఏర్పాటు చేశారు. అనంతరం స్థానికంగా ఉన్న ఆదివాసి మహిళా సంఘాలతో భోజన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా స్థానికంగా కొందరికి ఉపాధి చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

  నేటి నుంచి అందుబాటులోకి..
  నల్లమల్ల టూరిజం ప్యాకేజీ ఆన్లైన్ బుకింగ్ సేవలను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జిల్లా అడవి శాఖ అధికారి కృష్ణ గౌడ్ అమ్రాబాద్ డివిజన్ అధికారి రోహిత్ తెలిపారు. ఉన్నత అధికారుల చే టూరిజం ప్యాకేజీ యాత్రను ప్రారంభించేందుకు అడవి శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు..

  Anchor Udaya Bhanu: ఆ సమయంలో చెమటలతో బట్టలు మొత్తం తడిసిపోయేవి..! షాకింగ్ కామెంట్స్..


  ఏర్పాట్లు పూర్తి..
  దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రకృతి ప్రేమికులు విజ్ఞాన యాత్ర తో నల్లమల్ల అందాలను ఆస్వాదించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రోజుకు కనిష్టంగా 12 మందికి గరిష్టంగా 20 నుంచి 25 మందితో యాత్ర సాగిందిలా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.

  Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. తెల్లవారుజామున ఇలా జరగడంతో..


  యాత్ర సాగే విధానం.
  అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవి ప్రాంతంలో నల్లమల్ల అందాలను తిలకించేందుకు నల్లమల్ల విజ్ఞాన యాత్ర పేరుతో యాత్ర ఇలా కొనసాగుతుంది. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో లో గల అమ్రాబాద్ సి బీట్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అనంతరం పర్యాటకులకు అడవి పరిరక్షణ పెద్ద పులులు, ఇతర వన్య ప్రాణాలు సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై లఘు చిత్ర విక్షణ ఉంటుంది.

  ఆ తరువాత అడవి శాఖ నేర పరిశోధన నిమిత్తం ఏర్పాటుచేసిన ల్యాబ్ ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసే విధానాన్ని చూపిస్తారు. తదుపరి టైగర్ రిజర్వ్ అంటే ఏమిటి వారి పర్యవేక్షణ కోసం అడవి శాఖ అధికారులు చేపడుతున్న పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు..
  Published by:Veera Babu
  First published:

  Tags: Gadwal, Jogulamba gadwal, Mahabubnagar, Telangana tourism

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు