హోమ్ /వార్తలు /తెలంగాణ /

మట్టి వాటర్ బాటిల్స్ కు భారీగా పెరిగిన డిమాండ్.! వాటితో ఇన్ని లాభాలున్నాయా..?

మట్టి వాటర్ బాటిల్స్ కు భారీగా పెరిగిన డిమాండ్.! వాటితో ఇన్ని లాభాలున్నాయా..?

X
మట్టిబాటిళ్లపై

మట్టిబాటిళ్లపై ఆసక్తి చూపిస్తున్న ప్రజలు

వేసవిలో చాలావరకు మట్టి కుండలో నీటిని తాగడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఫ్రిజ్లో నీటిని తాగడం కంటే మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటినితాగడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలుగుతాయనే ఉద్దేశంతో మట్టికుండల వైపు ప్రజలు పరుగులు పెడుతుంటారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

Naveen Kumar, News18, Nagarkurnool

వేసవిలో చాలావరకు మట్టి కుండలో నీటిని తాగడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఫ్రిజ్లో నీటిని తాగడం కంటే మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటినితాగడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు తొలుగుతాయనే ఉద్దేశంతో మట్టికుండల వైపు ప్రజలు పరుగులు పెడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో మట్టి కుండలతో పాటు మట్టి గ్లాసులు, మట్టి వాటర్ బాటిల్స్ కూడా వినియోగించడంపై ప్రజలు ఎంతో ఆసక్తి చెబుతున్నారు. గత రెండు ఏళ్ళుగా ఈ తరహా వస్తువులను కొనుగోలు చేయడానికి నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో తయారీదారులు సైతం మట్టి కుండలతో పాటు మట్టి కూజాలు, వాటర్ బాటిళ్లు, గ్లాసులు, టీ కప్పులను తయారు చేయడం మొదలుపెట్టారు.

అయితే, వీటికి ప్రత్యేక శిక్షణలు తీసుకోవాల్సి వచ్చిందని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మట్టికుండల తయారీదారుడు లోకేష్ చెప్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎండబెట్ల గ్రామ సమీపంలో ఈ మట్టి కుండలను, వాటర్ బాటిల్, మిగతా మట్టి పాత్రలను తయారు చేస్తున్నారు. వీటిని తయారు చేయడానికి మొత్తంగా 80 రూపాయల వరకు ఖర్చు వస్తుందని రూ.100 రూపాయలకు వీటిని విక్రయిస్తున్నామని చెప్పారు. జనంఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు కాబట్టి తయారు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వీటిని విక్రయిస్తున్నామని చెప్పారు.

ఇది చదవండి: హస్త కళలకు కేరాఫ్ అడ్రస్.. లేపాక్షి ప్రత్యేకత ఇదే

మట్టి పాత్రల్లో నిల్వ ఉంచిన నీరు తాగడం, ఆహారం తీసుకోవడం వల్ల చాలావరకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా శరీరానికి నీటి శాతాన్ని అందించడంలో ఎంతో తోడ్పడుతుందని డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారు. ట్రెండ్ అనేది మారుతూ వస్తుందని.. ప్రజల అభిరుచికి అనుగుణంగా వస్తువులు తయారు చేస్తూ ఉంటామని లోకేష్ చెప్పుకొచ్చారు.

వీటితో పాటుగా ఉగాది పచ్చళ్ళు తయారు చేసేందుకు ప్రత్యేకమైన కుండలను, పాత్రలను కూడా తయారు చేస్తామని వివరించారు. వీటన్నింటికీ ప్రత్యేక శిక్షణను తీసుకోవాల్సి వస్తుందని.. ఆ శిక్షణను తీసుకొని తాము రకరకాల డిజైన్లలో ఇలాంటి వస్తువులు తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎవరైనా కావాలంటే మీ అభిరుచికి తగ్గట్లు తయారుచేస్తామని ఫోన్ నెంబర్ 9948759188 కూడా ఇచ్చారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana