హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar kurnool: జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్ల కేటాయింపు డిమాండ్

Nagar kurnool: జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్ల కేటాయింపు డిమాండ్

X
బీసీలకు

బీసీలకు సీట్ల కేటాయింపు

Telangana: రాష్ట్రంలో జనాభా ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల్లో 52% సీట్లను కేటాయించాలని బి.ఎస్.పి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం నాయకులు సాంబశివ గౌడ్ హాజరై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

రాష్ట్రంలో జనాభా ప్రకారం 52 శాతం ఉన్న బీసీలకు ఎన్నికల్లో 52% సీట్లను కేటాయించాలని బి.ఎస్.పి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంఘం నాయకులు సాంబశివ గౌడ్ హాజరై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 52 శాతం మంది బీసీలకు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్ ఇవ్వకుండా కేవలం ఓసిలకుమాత్రమే అధిక టికెట్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు.ఈ విధానాన్ని మారుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కొత్త విధానం తెచ్చే విధంగా బీసీ కులాలన్నిటికీ టికెట్లు రిజర్వేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.

తమ బీఎస్పీ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రకారమే అన్ని కులాల వారికి కూడా టికెట్లు కేటాయించడం జరుగుతుందని వివరించారు. 52% ఉన్నటువంటి బీసీలకు టికెట్ కేటాయించడంతోపాటు 8 శాతం ఉన్న ఓసీలకు ఇప్పటివరకు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కులాల వారికి టికెట్లు అందించి గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు.

ఒకటి రెండు సామాజిక వర్గాలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ పట్టణ నాయకులు కుమార్ మాట్లాడుతూ ముందు తమ పార్టీలో ఈ విధానాన్ని అమలు చేసిన తర్వాతనే ఇతర పార్టీల నాయకులను డిమాండ్ చేస్తున్నామని వివరించారు. ఓసిల్లో ఉండే బ్రాహ్మణ, వైశ్య కులాల వారికి కూడా తమ పార్టీ తరఫున అసెంబ్లీలో నిలబడి పోటీ చేసేందుకు టికెట్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు