హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS News: ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఆదరణ మరిచింది.. ప్రభుత్వ బీమా కోసం మత్స్యకారుల నిరీక్షణ

TS News: ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఆదరణ మరిచింది.. ప్రభుత్వ బీమా కోసం మత్స్యకారుల నిరీక్షణ

తెలంగాణలో మత్స్యకారులకు అందని బీమా

తెలంగాణలో మత్స్యకారులకు అందని బీమా

చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, చిన్నచిన్న రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకార బాధిత కుటుంబాలకు ఏళ్ళు గడుస్తున్నా బీమా డబ్బులు అందడం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  N. Naveen Kumar, News18, Nagarkurnool

  2020 ఏప్రిల్ 16న మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar District) దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజేష్ ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అప్పటికే ఆఫీసర్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. తూములు తెరవడంతో వలతో సహా అందులో చిక్కుకున్న రాజేష్ మృతిచెందాడు. దీంతో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం అందించే బీమా కోసం రాజేష్ భార్య లక్ష్మమ్మ దరఖాస్తు చేసుకోంది. రెండున్నరేళ్లు దాటినా బీమా రాలేదు. అధికారులను అడిగితే 'అప్లికేషన్ హైదరాబాద్ పంపించామని, అక్కడి ఆఫీసర్లు ఢిల్లీకి కూడా పంపించినట్లు రిపోర్టులు వచ్చాయని' సమాధానం ఇచ్చారు. కానీ ఇంతవరకు పరిహారం అందలేదు. ఈ ఒక్క సంఘటనే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, చిన్నచిన్న రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టులలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకార బాధిత కుటుంబాలకు ఏళ్ళు గడుస్తున్నా బీమా డబ్బులు అందడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిషర్‌మెన్ కోపరేటివ్ సొసైటీలు 1,081 ఉండగా వీటిలో 10,776 మంది సభ్యులు ఉన్నారు. ఫిషర్ ఉమెన్ కోపరేటివ్ సొసైటీలు 20 ఉండగా వీటిలో 753 మంది సభ్యులు ఉన్నారు. ఈ సొసైటీలో ఉన్న సభ్యులు వారి వారి ప్రాంతంలో ఉండే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, ప్రాజెక్టుల్లో చేపలు పడుతూ ఉపాధి పొందుతుంటారు. అయితే చేపల వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మృతిచెందితే రూ.4 లక్షల బీమా ప్రభుత్వం కల్పించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 2 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 2 లక్షలుగా ఉంది.

  ఇది చదవండి: రాజన్న భక్తులకు శుభవార్త.. ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేక పూజలు

  కాగా ఉమ్మడి జిల్లాలో 2020, 2021, 2022లో 16 మంది మత్స్యకారులు మృతి చెందగా వీరిలో రెండు కుటుంబాలకు రూ. 4 లక్షలు చొప్పున బీమా అందింది. మిగతా ఎవరికి కూడా ఎలాంటి పరిహారం అందలేదు. మత్స్య కారులు మృతి చెంది రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బీమా డబ్బులు అందకపోవడంతో వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

  ఇది చదవండి: కాలాపానిని తలపించే నిజాం కాలం నాటి జైలు.., మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

  అవగాహన లేక దరఖాస్తు చేసుకోని మత్స్యకారులు: నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా మత్స్యకారులకు బీమా అందిస్తారు. అయితే ఈ స్కీం పై అధికారులు మత్స్యకారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు చాలామంది బీమాకు దూరం అవుతున్నారు. చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతిచెందితే బీమా కోసం అప్లై చేసుకోవాలి. ఇందుకోసం ఆర్ఐ పంచనామా రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్, లీగల్ సర్టిఫికెట్, సర్టిఫికెట్‌తో పాటు మరో ఐదు రకాల సర్టిఫికెట్లు అప్లికేషన్‌కు జత చేయాలి. ఈ దరఖాస్తును ప్రాథమిక మత్స్యశాఖ ఆఫీసులో అందించాలి. వారు ఈ అప్లికేషన్‌ను హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫీసుకు అక్కడి నుంచి ఢిల్లీకి పంపుతారు. అయితే అప్లికేషన్‌లో ఎలాంటి తప్పులు ఉన్నా ఫిషరీస్ బోర్డ్ తిరస్కరిస్తుంది. దీంతో అవగాహన లేక కొన్ని, తప్పిదాల వలన కొందరు మత్స్యకారులు ఈ బీమాకు నోచుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్న స్థానిక ఆఫీసర్లు మత్స్యకారులకు బీమా అందేలా చర్యలు చేపట్టడం లేదు.

  రిజర్వాయర్లలో చెరువులలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు థర్మోకోల్ తెప్పలను ఉపయోగించి చేపల వేటకు వెళ్తున్నారు. అయితే నీటిలో వలలు వేసినప్పుడు వీటిలో చిక్కుకొని ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు ఇంజన్ బోట్లను అందుబాటులోకి తేవాల్సి ఉన్నా వాటిని సబ్సిడీల కింద కూడా మత్స్యకారులకు అందించడం లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీటికి మంజూరు చేస్తున్నా, అధికారులు వాటిని డ్యాం బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఉండే మత్స్యకారులకు మాత్రమే ఇస్తున్నారు. ఈ క్రమంలో చెరువులు, కుంటల్లో చేపలు వేటకు వెళ్లిన వారికి కూడా సబ్సిడీ కింద ఇంజన్ బోట్లను ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు