హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఈ దొంగ మామూలోడు కాదు బాబోయ్​.. ఏకంగా ఎస్ఐ ఇంటికే కన్నం వేశాడు..

Nagarkurnool: ఈ దొంగ మామూలోడు కాదు బాబోయ్​.. ఏకంగా ఎస్ఐ ఇంటికే కన్నం వేశాడు..

X
గజదొంగ

గజదొంగ

నాగర్‌కర్నూలులో నానాటికి చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే... అదును చూసి ఏకంగా పోలీస్ ఎస్ఐ నివాసం ఉన్న యజమాని ఇంటికే కన్నం వేశాడో ఘనుడు. దీంతో పోలీసులు ఉన్న ఇంటికే భద్రత లేకపోతే తమకేం భద్రత ఉంటుందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

(N.Naveen Kumar,News18,Nagarkurnool)

నాగర్‌కర్నూలు (Nagarkurnool) జిల్లాలో నానాటికి చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే... అదును చూసి ఏకంగా పోలీస్ ఎస్ఐ (Police Sub Inspector Home) నివాసం ఉన్న యజమాని ఇంటికే కన్నం వేశాడో ఘనుడు (Thief). దీంతో పోలీసులు ఉన్న ఇంటికే భద్రత లేకపోతే తమకేం భద్రత ఉంటుందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో విద్యానగర్ కాలనీకి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan reddy) అనే వ్యక్తి ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగుడు రాత్రి ఒంటి గంట తర్వాత ఇంటి తాళాలు పగలగొట్టి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటిలోని 55 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు దోచుకెళ్ళాడు.

అయితే ఇదే ఇంట్లో ఎస్ఐ (SI) కుటుంబం అద్దెకు ఉంటుంది. ఎస్ఐ మహేందర్ కుటుంబంతో సహా కొన్ని రోజులుగా విష్ణువర్ధన్ రెడ్డి ఇంటిలో నివాసం ఉంటున్నారు. 20 రోజుల క్రితమే మహేందర్‌కు మహబూబ్‌నగర్ (Mahbubnagar) బదిలీ అవగా.. కుటుంబ సభ్యులు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఈక్రమంలోనే గురువారం అర్ధరాత్రి అందరూ కలిసి వినాయక నిమజ్జనం వేడుక చూస్తుండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ప్రస్తుత ఎస్ఐ రమేష్.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు నాగర్‌కర్నూల్ జిల్లాలో గత కొంతకాలంగా వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇల్లు విడిచి వెళ్లాలంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. గత 6 నెలల నుంచి జిల్లాలో జరిగిన దొంగతనాలు పరిశీలిస్తే... నాగర్‌కర్నూల్ పట్టణ కేంద్రంలో కొల్లాపూర్ చౌరస్తాలో మూడు ఫర్టిలైజర్ దుకాణాల్లో చోరీకి పాల్పడి పోలీసులకు సవాళ్లు విసురారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనలతో ముందడుగు వేయడమే కాక అసలు నేరాలే కాకుండా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. నేరాల నియంత్రణ కోసం జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లాలో జనవరి నుంచి జూలై వరకు 22 పోలీస్ స్టేషన్లో 134కు పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 45 కేసులకు సంబంధించిన రూ. 40.42 లక్షల వరకు పోలీసులు రికవరీ చేశారు. ఇందులో అత్యధికంగా అచ్చంపేట, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, కల్వకుర్తి, అమ్రాబాద్, వంగూరు, చారగొండ మండలాల పరిధిలో ఉన్నాయి.

First published:

Tags: Local News, Nagarkurnool, Police, Theft

ఉత్తమ కథలు