Home /News /telangana /

NAGAR KURNOOL DANCE MASTER POLOJU SATYAM TRAINED IN CLASSICAL AND TRADITIONAL DANCE FOR 45 YEARS IN NAGARKURNOOL DISTRICT SNR NNK BRV

Dance Teacher Satyam: సాంప్రదాయ నృత్యాన్ని కాపాడుతున్న నాగర్‌కర్నూల్ నటరాజు

(డ్యాన్స్‌

(డ్యాన్స్‌ మాస్టర్ సత్యం)

Dance Master: ఆయన కళామతల్లి ముద్దుబిడ్డ. శాస్త్రీయ, సంప్రదాయ కళలను బ్రతికిస్తూ వాటిపై ఎందరికో శిక్షణ ఇస్తూ జీవిస్తున్న కళాకారుడు. 45సంవత్సరాల సుధీర్ఘ నృత్య శిక్షణలో వేలాది మందికి తర్ఫీదు ఇచ్చిన సహజ నృత్యకారుడు ఎక్కడున్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagar Kurnool)
    నిద్రపోతున్న సమాజాన్ని తట్టిలేపేది కళ. కనులకు కనువిందు చేసిది కళ. ప్రశ్నించేది కళ...ఆలోచింపజేసేది కళ. ఇలాంటి కళలన్నింటిలో అగ్రగామిగా నిలుస్తుంది సాంప్రదాయక, శాస్త్రీయ, గిరిజన నృత్య కళలు. కళలకు ప్రాణం పోసేందుకు ఎంతో మంది కళాకారులు తమ జీవితాలను అంకితం చేశారు. సాంప్రదాయ నృత్యకళలో వెంపటి చినసత్యం లాంటి వారిని నటరాజులుగా సమాజం కీర్తిస్తుంది. ఇలాంటి నటరాజే నాగర్‌కర్నూల్‌(Nagarkurnool)లో ఒకరు ఉన్నారు. ఆయనే డాన్స్ మాస్టర్(Dance master)పోలోజు సత్యం(Poloju Satyam). గత 45 ఏళ్లు(last 45 years)గా కళామతల్లిని నమ్ముకుని తన ప్రదర్శనలు, శిక్షణతో ఎంతో మందిఅభిమానులను, శిష్యులను సంపాధించుకున్నారు సత్యం మాస్టారు. ఆయన వద్ద సాంప్రదాయ నృత్యం(Traditional dance) నేర్చుకున్న అనేక మంది కళాకారులుగా ఎదిగి జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నారు.

    చిన్నతనం నుంచే కళలపై మక్కువ :
    నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన పోలోజు సత్యం మాస్టారు చిన్నతనం నుంచే కళల పట్ల ఇష్టం పెంచుకున్నారు. తన 3వ తరగతి నుంచే కళల పట్ల ఆకర్శితుడైన సత్యం మాస్టర్ మొదట్లో సింగర్‌గా రాణించాలనుకున్నారు. నాగర్‌కర్నూల్‌లోని \"కళాభారతి\" వ్యవస్థాపకులు \"నరసింహ్మా చార్యులు\" వద్ద శిష్యుడిగా చేరారు. సత్యంలోని టాలెంట్‌ను గుర్తించిన నరసింహ్మా చార్యులు, ఆయనను సాంప్రదాయక నృత్యం నేర్చుకోమని ప్రోత్సహించారు. ఇంటర్మిడియట్ పూర్తి చేసిన తరువాత తెలుగు విశ్వవిద్యాలయంలో చేరిన సత్యం మాస్టారు తనకు ఇష్టమైన నృత్య కళల్లో ప్రావీణ్యం సంపాదించారు. జానపద నృత్యం (Folk Dance), కూచిపుడి, వంటి కళలు నేర్చుకొని డిగ్రీ, పీజీ పట్టాలను పొందారు. ఆ తరువాత, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో నృత్య ప్రదర్శనలు చేసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు సత్యం మాస్టారు. సింగపూర్ వంటి దేశాల్లో సాంప్రదాయక నృత్యాలను ప్రదర్శించి..అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటారు.



    సాయి లహరి ఆర్ట్స్ అకాడమి స్థాపన:
    కళామాతల్లినే నమ్ముకున్న సత్యం మాస్టారు, సాంప్రదాయ జానపద కళలు కనుమరుగవకుండా తన వంతుగా సేవ చేయాలనీ భావించారు. దీంతో సొంత ఊరు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 ఏళ్ల క్రితం \"సాయి లహరీ ఆర్ట్స్ అకాడమిని\" స్థాపించారు. తన కుమార్తె పేరుపై స్థాపించిన ఈ అకాడమి ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నృత్య కళలు నేర్పిస్తున్నారు సత్యం మాస్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సాంప్రదాయక నృత్య ప్రదర్శనలు జరిగినా అక్కడ తప్పనిసరిగా సత్యం మాస్టరు శిష్య బృందం ప్రదర్శన ఉంటుంది. సత్యం మాస్టారు ఇప్పటి వరకు దాదాపుగా 5 వేలకు పైగా స్టేజీ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి వేసవిలో ప్రత్యేక శిక్షణా శిభిరాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నృత్య కళలలో శిక్షణలు అందిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 100 మందికిపైగా విద్యార్థులకు సాంప్రదాయ నృత్యంలో శిక్షణ అందిస్తున్నారు.

    ఇది చదవండి: టీచర్ జాబ్ కోసం పురిటి నొప్పుల్ని భరించింది .. సంగారెడ్డి జిల్లాలో ఆ మహిళ ఏం చేసిందంటే



    గద్వాల బాలభవన్‌లో డాన్స్‌మాస్టర్‌గా విధులు:
    ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లోని సాయి లహరీ అకాడమి నిర్వహణ బాధ్యతలు సత్యం మాస్టారు కుమార్తె చూస్తుండగా, ఆయన గద్వాలలోని \"బాల భవన్‌లో\" డాన్స్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా సమీపంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ భవన సముదాయంలో \"సాయి లహరి ఆర్ట్స్ అకాడమీ\" నిర్వహిస్తున్నారు. డాన్స్ మాస్టర్ పోలోజు సత్యం ద్వారా సాంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకోదలచిన వారు నేరుగా ఆయన్ను సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9440075601
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Classical dancer, Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు