హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఖరీదైన టీవీ ఆశ చూపి బ్యాంకు ఖాతా ఊడ్చేసిన సైబర్ మోసగాళ్లు.. ఎలా మోసం చేశారంటే?

Nagarkurnool: ఖరీదైన టీవీ ఆశ చూపి బ్యాంకు ఖాతా ఊడ్చేసిన సైబర్ మోసగాళ్లు.. ఎలా మోసం చేశారంటే?

సైబర్​ మోసం

సైబర్​ మోసం

మీకు లక్కీ డ్రాలో ఖరీదైన టీవీ వచ్చిందని, కొంత డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే టీవీ సొంతం చేసుకోవచ్చని సైబర్ మోసగాళ్లు చెప్పడంతో అందుకు ఆశపడి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి వ్యక్తి మోసపోయిన సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

(N. Naveen Kumar, News18, Nagarkurnool)

మీకు లక్కీ డ్రాలో (Lucky Draw) ఖరీదైన టీవీ వచ్చిందని, కొంత డబ్బు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే టీవీ (TV) సొంతం చేసుకోవచ్చని సైబర్ మోసగాళ్లు (Cyber Frauds) చెప్పడంతో అందుకు ఆశపడి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి వ్యక్తి మోసపోయిన సంఘటన వనపర్తి (Wanaparti) జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు బిఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 3న మధ్యాహ్నం ఒక అజ్ఞాత వ్యక్తి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి మీకు టీవీ వచ్చిందని, నగదు చెల్లిస్తే పంపిస్తామని తెలిపారు. దీంతో ఆశపడిన వెంకటేశ్వరరావు మొదట రూ. 5700 ఆన్‌లైన్ ద్వారా చెల్లించారు. ఇంకా డబ్బులు వేస్తే మొత్తం జమవుతుందని చెప్పడంతో రెండు దఫాలుగా రూ.2.13 లక్షలు దాకా పంపించాడు. ఆ తర్వాత ఫోన్ కలవకపోవడంతో మోసపోయానని గ్రహించి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి:

జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు ఈనెల 11న రాయపూర్ నుంచి ద్విచక్ర వాహనంపై గట్టు వైపు వస్తున్న ఆంజనేయులు.. రామాపురం వైపు వెళుతున్న హుస్సేనప్ప (55) ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రామపురంకు చెందిన హుస్సేనప్ప కాలికి బలమైన గాయం కాగా గొర్లఖాన్ దొడ్డిలో కట్టు కట్టించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కర్నూలుకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి:

మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కోయిలకొండ మండలంలో గుంబతాండకు చెందిన రాందాస్ (30) కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఎస్సై శ్రీనయ్య తెలిపిన వివరాలు మేరకు.. గతంలో హైదరాబాద్‌లో (Hyderabad) పనిచేసే రాందాస్...కుటుంబ కలహాలు నేపథ్యంలో తండాకు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. గ్రామానికి చెందిన చక్రినాయక్...తాను కౌలు చేస్తున్న పొలానికి అడవి పందులు రాకుండా విద్యుత్ తీగలను అమర్చాడు. రాందాస్ ఈనెల 11 రాత్రి కూలి పనులు ముగించుకొని వస్తుండగా, విద్యుత్ ఫెన్సింగ్ గమనించక పోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సుగుణ, పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Crime news, Local News, Mahbubnagar, Nagarkurnool, Wanaparthi

ఉత్తమ కథలు