(N.Naveen Kumar,News18,Nagarkurnool)
సీపీఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జన చైతన్య యాత్ర చేపట్టింది. మార్చి 17న ప్రారంభించిన ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మూడు బృందాలుగా అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఎం పార్టీ చైతన్య యాత్ర బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు సాగర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా తాము ఈ జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని వివరించారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా నిత్యవసర ధరలు, పెట్రోల్, డీజిల్ , ముడి సరుకుల ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవస్థలు తెచ్చిపెట్టిందని ఆరోపించారు.
ఈ ప్రభుత్వ పాలన వలన పేద మధ్యతరగతి కుటుంబ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైతన్యాన్ని కల్పించేందుకు జన చైతన్య యాత్రను చేపట్టామని వివరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి బస్టాండ్ వరకు బాడీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.
బీజేపీ ప్రభుత్వం విధానాలను ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ప్రభుత్వం వెంటనే పెరిగిన ధరలను అదుపు చేసే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని, ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజలను దిక్కుతోచని స్థితిలోకినెట్టి వేస్తుందని ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్ర ముగిసిన తరువాత ఏప్రిల్ నెలలో సీపీఎం పార్టీ జాతీయ నాయకుల చేత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana