Naveen Kumar, News18, Nagarkurnool
తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోరు అనడానికి గద్వాల జిల్లా (Gadwala District) లో జరిగిన ఓ కేసు సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక వ్యక్తిని అవమానకరంగా మాట్లాడుతూ నలుగురిలో అవమానించినందుకు గద్వాల జిల్లా కోర్టు ఆసక్తికరమైన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు చాలామంది చులకనగా మాట్లాడే వారికి, అవమానకరంగా మాట్లాడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుంది. అవమానకరంగా మాట్లాడి.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తికి ఐదేళ్ల శిక్షతోపాటు 5000 రూపాయల జరిమాలను విధించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకు ఆ కేసు ఏమిటి ఆ వ్యక్తి ఎవరో వివరాలు తెలుసుకుందాం.
జోగులంబా గద్వాల జిల్లాలో ఒక వ్యక్తిని అవమానపరిచి అతడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన కేసులో దోషుకి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధిస్తూ అడిషనల్ సీనియర్ సివిల్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రభాకర్ తూర్పు తీర్పునిచ్చినట్లుగా గద్వాల జిల్లా ఎస్పి రంజత్ రంజిత్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి గద్వాల ఎస్పీ కథనం మేరకు.. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రానికి చెందిన కురువ పరశురాముడు,కురువ సుధాకర్ లు పశువుల కాపరిగా జీవనం సాగించేవారు. ఒకరోజు పరశురాముడు సుధాకర్ భార్య ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించి అత్యాచారం చేయబోయాడు. ఈ విషయమై ఫిబ్రవరి2017లో సుధాకర్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి నిందితుడు పరశురాముడు రిమాండ్కు పంపించారు.
జైలు నుంచి వచ్చిన పరుశురాముడు మళ్ళీ ప్రజల మధ్యలో సుధాకర్ను నీవు నన్ను ఏమి చేయలేకపోయావు నన్ను జైలుకు పంపించడం ద్వారా మీ కుటుంబం పరువు బయటకు తెలిసిపోయింది అని అవమానకరంగా మాట్లాడాడు. ఈ అవమానం భరించలేక మద్యానికి బానిసై ఏప్రిల్ 17 2017లో సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు అక్క సుమిత్ర ఫిర్యాదు మేరకు రాజోలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
gadwal
అప్పటి ఎస్సై జివి రమణ విచారణ చేసి కోర్టులో చార్జీ ఫైల్ చేశారు. ఈ కేస్ పై గద్వాల అడిషనల్ సీనియర్ సివిల్ సెషన్స్ కోర్ట్జడ్జి ప్రభాకర్ వాదోప వాదనలు విన్న తర్వాత నిందితుడు కురువ పరశురాముకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్షపడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిహెచ్ వెంకట్ రాములు ఈ కేసులో ట్రైను సమర్ధవంతంగా నిర్వహించి శిక్ష పడడానికి కృషి చేసిన డిఎస్పి రంగస్వామి, శాంత కుమార్, శాంతి నగర్ సిఐ శివశంకర్ ను తదితరులను ఎస్పీ అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jogulamba gadwal, Local News, Nagarkarnol district, Telangana