హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఇది సినిమా స్టైల్ దోపిడీ..! ఎదురెళ్లి మరీ డబ్బులిచ్చారు..!

ఇది సినిమా స్టైల్ దోపిడీ..! ఎదురెళ్లి మరీ డబ్బులిచ్చారు..!

జడ్చర్లలో విదేశీ కరెన్సీ పేరుతో మోసం

జడ్చర్లలో విదేశీ కరెన్సీ పేరుతో మోసం

మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి ఏ రకానికి చెందినవారు, వారు ఎలా చెప్తే నమ్ముతారు అనే విషయాలను ఎంక్వయిరీ చేసి అదే రీతిలో వెళ్లి వారిని మోసం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar | Jadcherla | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి ఏ రకానికి చెందినవారు, వారు ఎలా చెప్తే నమ్ముతారు అనే విషయాలను ఎంక్వయిరీ చేసి అదే రీతిలో వెళ్లి వారిని మోసం చేస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar distric) లో యూఏఈ కరెన్సీ (UAE Currency) తమ వద్ద ఉన్నాయని వాటికి బదులుగా ఇండియన్ కరెన్సీ (Indian Curency)ఇవ్వాలని ఓ వ్యక్తి ఒప్పందం కుదిరించుకున్నాడు. ఎదుటి వ్యక్తిని నమ్మించేందుకు శాంపిల్ గా కొన్ని విదేశీ కరెన్సీలను చూపించారు. వీటిని నమ్మిన సదరు వ్యక్తి 5 లక్షలు ఇచ్చి మోసపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను మహబూబ్ నగర్ పోలీసుల కథనం ప్రకారం.. దుబాయ్ (Dubai) నోట్లను ఎక్స్చేంజ్ చేసుకొని ఇండియన్ కరెన్సీ ఇవ్వాలంటూ ఒప్పందం చేసుకున్న సంఘటనలో ఐదు లక్షలతో ఊడాయించారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది ఈ ఘటన. జడ్చర్ల సిఐ రమేష్ బాబు వెల్లడించిన వివరాల మేరకు.. మహబూబ్ నగర్ మదీనా మసీదు ప్రాంతానికి చెందిన ఖజా సిజారుద్దీన్, ఫరీఫ యాస్మిన్ భార్యాభర్తలు. 30 ఏళ్లుగా దుబాయిలో ఉన్న ఖాజా గత సంవత్సరం ఇండియాకు వచ్చాడు. స్వస్థలమైన మహబూబ్ నగర్లో ఆప్టికల్ దుకాణం ప్రారంభించారు. 10 రోజుల క్రితం ఓ వ్యక్తి యూఏఈకి చెందిన దిర్హములు తీసుకుని వచ్చి తనకు ఇండియన్ కరెన్సీ అవసరమని నోట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలని కోరారు. అందుకు సమ్మతించి ఎక్స్చేంజ్ చేశాడు. ఇదే సందర్భంగా తన వద్ద ఉన్న 16 వేల దిర్హంలు ఉన్నాయని 35 లక్షలు ఇవ్వాలంటూ ఖజా సిరాజుద్దీన్ వద్ద డీల్ కు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని తన భార్య పరి సయాస్మిన్ కు వివరించారు. దీంతో సదరు వ్యక్తితో మాట్లాడి దిర్హంలు ఉన్నట్టు ఎలా నమ్మాలంటూ ప్రశ్నించాడు.

ఇది చదవండి: యూట్యూబ్, గూగుల్ బాగుండాలంటూ పోచమ్మకు బోనాలు.. యూట్యూబర్ల జాతర..

తన వద్ద ఉన్న విదేశీ నోట్లను ప్రత్యేకంగా తెచ్చి చూపించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచాలని కోరాడు. డీల్ లో భాగంగా మొదటి విడత 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. నోట్లను ఎక్స్చేంజ్ చేసేందుకు ఆదివారం ఉదయం జడ్చర్ల పట్టణం ఎంచుకున్నారు. జడ్చర్ల రైల్వే గేట్ సమీపంలో ఉన్నామని ఇక్కడికి వచ్చి ఇండియన్ కరెన్సీ ఇచ్చి దిల్హములు తీసుకెళ్లాలని సదరు వ్యక్తి సూచించడంతో ఐదు లక్షలతో భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. రైల్వే గేట్ సమీపంలో డీల్ కుదిరించిన వ్యక్తితో పాటు మరో మహిళ వచ్చింది. వీరిని అనుసరించిన భార్యాభర్తలు ఇద్దరు వెంట తీసుకువచ్చిన 5 లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ కరెన్సీఉన్న బ్యాగులు తీసుకున్నారు.

బ్యాగులో దిర్హంలోని పరిశీలించే లోపే ఐదు లక్షల నగదుతో పరారీ అయ్యారు. బ్యాగులోవిదీశీ కరెన్సీకి బదులుగా కాగితాలను ఉంచారు. దీంతో మోసపోయామని గమనించి వెంటనే 100కు ఫోన్ చేశారు. సంఘటన స్థలానికి జడ్చర్ల సిఐ రమేష్ బాబు చేరుకొని విచారణ చేపట్టారు. జరిగిన సంఘటనపై పరిసియాస్మిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసిఎస్ ఎస్ఐ శ్రీనివాస్ తో కలిసి విచారణ ప్రారంభించారు. కాగా అత్యాశకు లోను కావడంతోనే ఐదు లక్షలు మోసపోయారనిఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

First published:

Tags: Local News, Mahbubnagar, Telangana

ఉత్తమ కథలు