రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
ఫేస్బుక్ పరిచయాల ద్వారా మోసపూరిత ఘటనలు చోటు చేసుకుంటున్నవి. వివాహేతర సంబంధాలు చాలావరకు నేటి యువత సోషల్ మీడియా ద్వారానే మొదలవుతున్నాయి. ఇలాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో చోటుచేసుకుంది. పెళ్లయిన వ్యక్తితో ఫేస్బుక్లో పరిచయం చేసుకున్న ఒక యువతి అతనితో సహజీవనం చేసింది.
అతనికి వివాహం కాలేదనుకొని ఒకే ఇంట్లో కలిసి ఉంది.తీరా అతని భార్య ఫిర్యాదుతో అసలు నిజాలు బయటపడ్డాయి. నాకు పెళ్లి కాలేదు, నాకు ఎవరూ లేరంటూ ఓ వ్యక్తి యువతితో ఫేస్బుక్లో పరిచయం పెంచుకున్నాడు. యువతిని నమ్మించి యువతి ఇంట్లోనే సహజీవనం పెట్టాడు. తీరా ఆ వ్యక్తి భార్య మిస్సింగ్ కేసు పెట్టడంతో అసలు నిజం బయటపడింది.
వివరాల్లోకి వెళితే బస్వాపురం గ్రామానికి చెందిన యువతికి ఏపీ రాష్ట్ర తాడిపత్రికి చెందిన దూదేకుల మాబుతో రెండేళ్ల క్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. రోజు చాటింగ్ చేసుకునేవారు. మాబు తనకి ఎవరూ లేరని, పెళ్లి కాలేదని, నువ్వంటే ఇష్టమని గట్టిగా నమ్మించాడు. అతన్ని నమ్మిన యువతి తరచు అతినికి కొంత నగదు కూడా ఆన్లైన్లో పంపించింది. కాగా గతేడాది నవంబర్లో బస్వాపురంకు మాబు వచ్చి యువతి తల్లితో మాట్లాడి ఇక్కడే 45 రోజులపాటు ఉన్నాడు.
తాడిపత్రిలో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యక్తికి భార్య పిల్లలు ఉన్నారు. భర్త చాలా రోజులపాటు ఇంటికి రాకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో పోలీసులు అతని నగదు లావాదేవీలను పరిశీలించగా యువతి పంపిన నగదుపై ఆరా తీశారు. ఈనెల 7వ తేదీన గ్రామానికి తాడిపత్రి పోలీసులు బస్వాపురం చేరుకున్నారు. వారి ఇంటి వద్దకు వెళ్లి మాబుపై మిస్సింగ్ కేసు నమోదు అయిందని అతని తీసుకెళ్తామని చెప్పారు. నేను తిరిగి వస్తానని భయపడద్దని యువతకి చెప్పి వెళ్లిపోయాడు.
వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో యువతి అతనికి ఫోన్ చేసింది. మాబు తనకు పెళ్లయిందని పిల్లలు ఉన్నారని నీ దారి నీదే నా దారి నాదే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి స్థానిక ఉండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా సోషల్ మీడియా ద్వారా చాలామంది యువతలను కొంతమంది మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన ప్రతి ఒక్కరిని నమ్మకూడదని వారితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana