హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS Congress: ఈ నియోజకవర్గాలకు కాంగ్రెస్ లీడర్లే లేరు..! అయోమయంలో క్యాడర్

TS Congress: ఈ నియోజకవర్గాలకు కాంగ్రెస్ లీడర్లే లేరు..! అయోమయంలో క్యాడర్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిస్తేజంగా కాంగ్రెస్ పార్టీ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిస్తేజంగా కాంగ్రెస్ పార్టీ

సారి ఎన్నికల్లో తమనే గెలిపించాలంటూ బీఆర్ఎస్ (BRS Party), బిజెపి (BJP), నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకులు తమ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ (Congress Partt) పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar (Mahabubnagar), India

Naveen Kumar, News18, Nagarkurnool

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (Mahbubnagar District) లో దాదాపుగా అన్ని ప్రధాన పార్టీల నుంచి ఆయా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. ఉదయం మొదలుకొని రాత్రి 9 గంటల వరకు నియోజకవర్గంలోనే కలియ తిరుగుతూ ఈ సారి ఎన్నికల్లో తమనే గెలిపించాలంటూ బీఆర్ఎస్ (BRS Party), బిజెపి (BJP), నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నాయకులు తమ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ (Congress Partt) పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

సీటు కావాలని ఇతర నియోజకవర్గాల్లో నాయకుల పోటీ పడుతుండగా ఓ రెండు నియోజకవర్గాల్లో అసలు నాయకుడి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఉన్న నాయకులు తామే నిలబడతామంటూ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. మహబూబ్నగర్ జిల్లాలోని నారాయణపేట, కల్వకుర్తి నియోజకవర్గం వర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. నియోజకవర్గంలో నాయకత్వం వహించి ఆ పార్టీని ముందుకు నడిపించాల్సిన నేతలు నియోజకవర్గంలో పర్యటించేందుకు సమయం కేటాయించకపోవడం ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంతో కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి.

ఇది చదవండి: రేవంత్ గేమ్ ప్లాన్.. ఇక్కడ బరిలోకి సీతక్క తనయుడు..?

నియోజకవర్గ బరువు బాధ్యతలు మోయవలసిన నేతలు ఒకరు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండగా.. మరొకరు విస్తృత పర్యటిస్తాం మన సత్తా ఏంటో చూపిస్తాం అని ప్రకటనలకు మాత్రమే పరిమితమై అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండగా మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార పార్టీ నేతలను నిలదీయక ప్రజా సమస్యల పోరాటాలు చేయలేక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లడం లేదు. ఆ నాయకులు నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడంతో పార్టీ పరిస్తితులు చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ఇతర పార్టీలోకి చేరగా మరికొందరు ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.

ఇది చదవండి: అనాధ పిల్లలకు అమ్మ.. అనాధ శవాలకు కాటికాపరి.. ఓ మహిళ అంతులేని కథ

కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను బుజస్కాందాలపై వేసుకొని ముందుకు తీసుకువెళ్తాల్సిన చల్లా వంశీ చందర్ రెడ్డి ఏఐసిసి కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ పార్టీ కార్యక్రమాల బాధ్యతల నిర్వహణలో బిజీగా ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధువులలో జరిగే కార్యక్రమాలకు వంశీ హాజరవుతున్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు నామమాత్రంగా హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తూ కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నా.. వంశీ చందర్ రెడ్డి తన పలుకుబడిన ఉపయోగించుకొని టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తే తమకు అవకాశం రాదని వెనుకంజ వేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న వంశీ చందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను కల్వకుర్తి నుంచి పోటీ చేస్తానని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ముఖ్య నాయకులతో చెప్పినట్లు సమాచారం.

ఇది చదవండి: వారెవ్వా ఏం ఐడియా..! సెప్టిక్‌ట్యాంక్‌లో నాటుసారా బెల్లం పానకం!

ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో వచ్చి పార్టీ కార్యక్రమాలు చేపడితే ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో చెప్పలేదని.. సొంత పార్టీ నాయకులే సందేహాలు గుర్తించవలసిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది.నారాయణపేట నియోజకవర్గంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శివకుమార్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన కొన్ని నెలల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. శివకుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో అతనికి సంబంధించిన అశ్లీల ఫోటోలను అధికార పార్టీ సోషల్ మీడియా వారు వైరల్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యనే తిరిగి వచ్చిన శివకుమార్ రెడ్డి ఇక చూసుకుందామని నియోజకవర్గ ప్రజలకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని చెప్పారు.

కొన్ని రోజులపాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోషి పెరిగింది. కానీ అంతలోనే మళ్లీ ఏమైందో కానీ శివకుమార్ రెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు మళ్లీ అజ్ఞాతవాళ్ళకి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నియోజకవర్గాల్లో హార్ట్ సే హాత్ వంటి కార్యక్రమాలు పెద్దగా సాగలేదు. ఈ కారణంగా పార్టీ అధిష్టానం చొరవ చూపి కార్యక్రమాల నిర్వహించగల సత్తా ఉన్న నాయకులకు బాధ్యత అప్పగించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి వస్తారు అనుకుంటే శివకుమార్ రెడ్డి లేదా వంశీచంద్ర రెడ్డి లేదా ఇతరులకు గాని బాధ్యతలు అప్పగించి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ రెండు నియోజకవర్గాల ఎఫెక్ట్ వాటి పక్క నియోజకవర్గాలపై కూడా పడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొక తప్పదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పార్టీ అధిష్టానం ఏం చేయాలనే ఒక స్పష్టతకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో యువకులకే టికెట్లు ఇస్తామని ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఎవరికి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని అంశాలు వేసి చూడాల్సిందే.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana, TS Congress

ఉత్తమ కథలు