హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telngana: ఇప్పటికీ అక్షరాస్యతలో అట్టడుగునే ఈ జిల్లా!

Telngana: ఇప్పటికీ అక్షరాస్యతలో అట్టడుగునే ఈ జిల్లా!

అక్షరాస్యతలో వెనుకబడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా

అక్షరాస్యతలో వెనుకబడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) ఇంకాఅక్షరాస్యతలో వెనుకబడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District), నారాయణపేట జిల్లా (Narayanapeta District) లో అక్షరాస్యత శాతం సగానికి మించడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar (Mahabubnagar) | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) ఇంకాఅక్షరాస్యతలో వెనుకబడి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District), నారాయణపేట జిల్లా (Narayanapeta District) లో అక్షరాస్యత శాతం సగానికి మించడం లేదు. పాఠశాలలో చేరుతున్న విద్యార్థులు సైతం చాలా వరకు కనీసం పదో తరగతి కూడా చేరుకోవడం లేదు. స్కూల్ డ్రాప్ ఔట్స్విషయంలో జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించి తలసరి ఆదాయంలోను ఉమ్మడి పాలమూరు జిల్లాలో వెనుక అందులోనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్స్ అబ్స్ట్రాక్ట్ 2022 రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గద్వాల, నారాయణపేట జిల్లాలో విద్యార్థులు చాలా వరకు కనీసం పదవ తరగతి వరకు కూడా చేరుకోకుండానే బడి మానేస్తున్నారు.

హై స్కూల్ విద్యార్థుల డ్రాప్స్ విషయంలో గద్వాల జిల్లా 29.37 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో కొనసాగుతుండగా నారాయణపేట జిల్లాలో 19.59% మంది పదో తరగతి చదవకుండానే బడి మానేస్తున్నారు. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలో 15% మంది డ్రాప్స్ ఉంటున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు విషయంలో పాలమూరు జిల్లాలో వెనుకబడి ఉన్నాయి. ప్రధానంగా నాగర్కర్నూల్ వనపర్తి జిల్లాలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ శాతానికి పరిమితం అవుతుంది. ప్రజల్లో అక్షరాస్యత శాతంలో గద్వాల నారాయణపేట జిల్లాలో కనీసం 20 శాతం కూడా దాటడం లేదు. సాధారణంగా సంతకం చేయగలిగిన వారందరినీ అక్షరాస్యులుగానే భావిస్తారు. అయితే ఈ జిల్లాల్లో అక్షరాస్యులు సగం మంది కూడా లేరు.

ఇది చదవండి: సింగరేణి సిగలో మరో అందం.. ఆహ్లాదాన్నిస్తున్న పార్క్

నాగర్ కర్నూల్ జిల్లాలో అక్షరాస్యత శాతంలో 55.54, వనపర్తిలో 55.7% మహబూబ్నగర్లో 61.1% మంది అక్షరాస్యులు ఉన్నారు. మహిళల్లో అక్షరాస్యత విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గద్వాల జిల్లాలో మహిళల అక్షరాస్యత శాతం 39.5% ఉండగా నారాయణపేట జిల్లాలో 39.7% పరిమితం కాగా నాగర్ కర్నూలు జిల్లాలో 43.6, వనపర్తి జిల్లాలో49.6, మహబూబ్నగర్ జిల్లాలో 51.4 శాతం నమోదైంది. తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అట్టడుగునే కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లాలో రూ.1.41 లక్షల తో అతి తక్కువగా తలసరి ఆదాయం నమోదయింది. ఈ విషయంలో రాష్ట్రంలో లోనే అట్టడుగు స్థాయి నుంచి నాలుగో స్థానంలో నారాయణపేట కొనసాగుతుంది. రూ.1.46 లక్షల తలసరి ఆదాయంతో గద్వాల జిల్లా చివరి నుంచి ఆరో స్థానంలో ఉంది.

అలాగే నారాయణపేట జిల్లాలో అత్యధికంగా 5.28 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నాగర్కర్నూల్ లో 4.55 శాతం, మహబూబ్నగర్లో 4.41 శాతం, వనపర్తిలో 3.50 శాతంగద్వాలలో 2.25 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 9,05,660 మంది జనాభా ఉండగా అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో 5,62,1 48 మంది ఉన్నారు. జన సాంద్రత విషయంలో మహబూబ్నగర్లో అత్యధికంగా ఒక చదరపు కిలోమీటర్కు 329 మంది ఉంటే అత్యల్పంగా నాగర్కర్నూల్ లో 135 మంది ఉన్నారు.స్త్రీ, పురుష నిష్పత్తి విషయంలో నారాయణపేట జిల్లా ఆదర్శంగా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు రాష్ట్ర సగటు 988 మంది స్త్రీలు మాత్రమే ఉండగా నారాయణపేట జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1008మంది స్త్రీలు ఉన్నారు. వనపర్తిలో మాత్రం రాష్ట్ర సగటు కంటే తక్కువగా 960 మంది మాత్రమే ఉన్నారు.

First published:

Tags: Local News, Mahbubnagar, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు