హోమ్ /వార్తలు /తెలంగాణ /

వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టండి.. కలెక్టర్

వేసవిలో తాగు నీటికి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టండి.. కలెక్టర్

తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు

తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు

Telangana: వేసవిని దృష్టిలో ఉంచుకొని నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలతో సమర్ధవంతంగా నీటి సరఫరను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. .

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

వేసవిని దృష్టిలో ఉంచుకొని నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలతో సమర్ధవంతంగా నీటి సరఫరను అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.  ఎండ తీవ్రతతో ప్రజల ఆరోగ్య సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆర్‌డబ్ల్యూఎస్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు, ఇంజనీర్‌ లు, డిపిఓ, ఉద్యాన, వ్యవసాయ, తదితర శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. .

జిల్లాలోని 4 మునిసిపల్ పట్టణ ప్రాంతం వార్డులు, 710 గ్రామాల నివాస ప్రాంతాలలోని జనాభా ఎంత,జనాభాకు సరిపోయేంత నీరు లభ్యంగా ఉందా లేదా వంటి వివరాలపై గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల అధికారులు పరిశీలన చేపట్టారు.శ్రీశైలం రిజర్వాయర్ లో 811.80 ఫీట్లకు గాను ప్రస్తుతం 35.370 టీఎంసీల నీటి లభ్యత ఉందని, శ్రీశైలం జలాశయం లో 25 టీఎంసీల వరకు వస్తే జలాశ్రయం నుంచి లిఫ్ట్ చేయడం ఇబ్బందిగా అవుతుంది.

కాబట్టి సాగర్ జలాల నుండి రివర్స్ పంపిన ద్వారా శ్రీశైలం జలాశ్రానికి తరలించి త్రాగునీటికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని, ప్రతిరోజు త్రాగునీటికై 0.6 టీఎంసీలు, ప్రతి మాసానికి 2.4 టీఎంసీలు త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామని ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సుధాకర్ సింగ్ కలెక్టర్ కువివరించారు.

వేసవికాలంలో 710 గ్రామాల్లో ప్రతిరోజు 79 లక్షల లీటర్ల తాగునీటికి కొరత లేకుండా మిషన్ భగీరథ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటి నుండే పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.నాగర్ కర్నూల్ జిల్లాలోని 88 చెంచు పెంటలకు త్రాగునీరు అందించేందుకు ఎంత డబ్బైనా ఖర్చు చేస్తామని,తాగునీటి సమస్య తలెత్తకూడదుని అధికారులను ఆదేశించారు.చెంచుపెంటల్లో నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పంప్ హౌస్ లోకి కావాల్సిన నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖను ఆదేశిస్తామన్నారు.ఏక్కడ కూడా లీకేజీ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలు నిర్వహించి తాగునీటి సమస్య తలెత్తే ప్రాంతాలు, ఏఏ మరమ్మతులు చేపట్టాలి, తీసుకోవలసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర వాటిపై నివేదికలు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలో ఉన్నందున ప్రజల ఎవరికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.చిన్నపిల్లలు వృద్ధుల పట్ల ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అవగాహన కల్పించి, ఎండల తీవ్రత నుండి కాపాడాలన్నారు.

డిహైడ్రేషన్, ఎండ తీవ్రతతో వడ దెబ్బలకు అన్ని పీహెచ్సీల్లో వైద్య సేవలను ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రతి పీహెచ్సీలో రెండు బెడ్లను ప్రతి సిహెచ్సిలో పది బెడ్లను కేవలం ఎండ తీవ్రతో ఆరోగ్య సమస్యలు తరితే వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని సుధాకర్ లాల్ తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ నుండి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్కు వివరించారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలలో గ్రీన్ మ్యాట్ తో నీడనిచ్చేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

తప్పనిసరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా హరితహారం ద్వారా నాటిన మొక్కల సంరక్షణకై ప్రతి వారంలో రెండు రోజులు నీటిని పట్టాలని ప్రతి మొక్క చుట్టూ నీటి ప్రమాణం పెంచేలా గుంతలు తీయాలన్నారు.ఆర్డీవోలు తమ ప్రాంతాల గ్రామాలు వార్డులను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.పంచాయతీల్లో ఉన్న నీటి సమస్యల పట్ల పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని డిపిఓను ఆదేశించారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు