Home /News /telangana /

NAGAR KURNOOL CASE AGAINST THREE PEOPLE FOR DRINKING ALCOHOL AND LEOPARD ATTACK ON CATTLE NAGARKURNOOL NEWS NNK BRV PRV

Nagarkurnool: నాగర్​ కర్నూల్​లో చిరుత కలకలం.. అలర్టైన అధికారులు.. పూర్తి వివరాలివే

నాగర్‌కర్నూల్ పరిధిలో నేరాలు

నాగర్‌కర్నూల్ పరిధిలో నేరాలు

మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలో చిరుత (leopard)సంచారం ఆందోళనకరంగా మారింది. దేవరకద్ర మండల పరిధిలోని బస్వయిపల్లి గ్రామంలో బుధవారం చిరుత దాడిలో నాలుగు దూడలు చనిపోయాయి

    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు (Suicide) యత్నించిన ఘటన వనపర్తి  (Vananparti) జిల్లా అమచింత మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు అమరచింత పట్టణానికి చెందిన ముష్టి వెంకటేష్ (48) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) వెళ్లారు. ఎనిమిదేళ్లుగా అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూన్నాడు. కుటుంబ పోషణకు, ఇతర అవసరాల రీత్యా స్వగ్రామంలో అప్పులు చేశాడు వెంకటేష్. చేసిన అప్పులు తీర్చలేక గత కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈక్రమంలో బుధవారం అమరచింతకు వచ్చిన వెంకటేష్ ఉదయం 10 గంటల సమయంలో కత్తితో గొంతు కొసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయాలపాలైన వెంకటేష్‌ను స్థానికులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

    అడ్డాకుల మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి మద్యం సేవిస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన డ్రైవర్లు ఉప్పల బాలకృష్ణ, ఉప్పల శ్రీనివాస్, ఉప్పల గోపీలు...పని నిమిత్తం అడ్డాకుల మండల కేంద్రానికి వచ్చారు. రాత్రివేళ జాతీయ రహదారి పక్కన బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

    చిరుత దాడిలో నాలుగు లేగ దూడలు మృతి:

    మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లాలో చిరుత (leopard)సంచారం ఆందోళనకరంగా మారింది. దేవరకద్ర మండల పరిధిలోని బస్వయిపల్లి గ్రామంలో బుధవారం చిరుత దాడిలో నాలుగు దూడలు చనిపోయాయి. గ్రామానికి చెందిన రైతు లక్ష్మారెడ్డి పశువులను తోలుకుని మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ బావి దగ్గర కొట్టంలో కట్టేసి వచ్చాడు. బుధవారం వెళ్లి చూడగా పశువుల కొట్టంలో నాలుగు దూడలు చిరుత (cheetah) దాడిలో చనిపోయినట్టుగా గుర్తించాడు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా... ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు పరిసరాలను పరిశీలించారు. చిరుత నుంచి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎక్కడైన చిరుత కనిపించే ఆనవాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పంట పొలాల్లో, అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒంటరిగా పశువులను విడిచి పెట్టవద్దని సూచించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు