హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే పువ్వు.. ఇలా చేస్తే భారీగా ఆదాయం

Business Idea: గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే పువ్వు.. ఇలా చేస్తే భారీగా ఆదాయం

మోదుగ పువ్వులు

మోదుగ పువ్వులు

పలు కంపెనీలు కూడా ఆయుర్వేద మందుల తయారీ కోసం గిరిజనుల నుంచి మోదుగ బెరడు, కాండాన్ని సేకరిస్తున్నాయి. తద్వారా అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలు ఆదాయం పొందుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మీరు గ్రామాల్లో ఉంటూ.. ఏదైనా మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నారా. మీ కోసమే మరో అద్భుతమైన బిజినెస్ ఐడియా (Business Idea)ను తీసుకొచ్చాం. అదే మోదుగ పూల (Palash Flowers) వ్యాపారం. ఇవి మీకు దీర్ఘకాలం ఆదాయం తీసుకొస్తాయి. దేశవ్యాప్తంగా పర్సా, ఢాక్, టేసూ, కిశక్, సుప్కా, బ్రహ్మవృక్ష్, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ వంటి పేర్లతో పిలుస్తారు. ఏపీ, తెలంగాణలో మోదుగ పేరుతో చాలా సుపరిచితమైన చెట్టు ఇది. ఇప్పుడైతే పేపర్ ప్లేట్స్ వచ్చాయి గానీ.. గతంలో ఏదైనా శుభాకార్యాలు జరిగితే..ఈ చెట్టు ఆకులతోనే విస్తరాకులు చేసేవారు. వసంత రుతువు (Spring season)లో హోలీకి ముందు ఇవి పుష్పిస్తాయి. పువ్వులు కాషాయ రంగులో చాలా అందంగా ఉంటాయి. ఆ సమయంలో వీటిని చెట్టు నుంచి కోసి.. మార్కెట్లో విక్రయించాలి. మిగతా సమయంలో చెట్టు ఆకులు, బెరడును కూడా అమ్ముకోవచ్చు.

Weather Report: మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఈ 8 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ

ఉత్తరప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ , మధ్యప్రదేశ్ , ఝార్ఖండ్‌తో పాలు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మోదుగ చెట్లు కనిపిస్తాయి. యూపీ రాష్ట్ర పుష్ఫం కూడా ఇదే. వసంతకాలంలో హోలీ పండగ (Holi Festival) సమయంలో సహజ రంగుల తయారీలో మోదుగ పూలను వాడుతారు. మార్కెట్లో ఈ చెట్టు పువ్వులు, బెరడు, కాండం, ఆకులకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో.. ఎంతో మంది రైతులు ఈ చెట్లను ఇతర పంటల్లాగే సాగు చేస్తున్నారు. ఒక ఎకరం పొలంలో మోదుగ చెట్లను పెంచాలంటే రూ.50వేల వరకు ఖర్చు వస్తుంది. ఒక్కసారి నాటితే.. 30 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. మూడేళ్లకు ఇవి పుష్పిస్తాయి. 1981లో భారత ప్రభుత్వం మోదుగ పువ్వుతో ఉండే 35 పైసల తపాళా బిళ్లను విడుదల చేసిందంటే..దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ దేశాలు కూడా పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశాయి.

హోలీ సమయంలో మోదుగ పూలతో చేసిన సహజసిద్ధ రంగులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అక్కడి గిరిజనుల ద్వారా మోదుగ పూలను సేకరించి సహజ రంగులను తయారు చేయిస్తుంది. వాటికిమద్దతు ధర కల్పించి.. తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పలు కంపెనీలు కూడా ఆయుర్వేద మందుల తయారీ కోసం గిరిజనుల నుంచి మోదుగ బెరడు, కాండాన్ని సేకరిస్తున్నాయి. తద్వారా అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలు ఆదాయం పొందుతున్నారు.

ముక్కు, చెవి, మలమూత్రాలతో పాటు మరేదైనా చోట.. రక్తస్రావం అయినప్పుడు మోదుగ కాషాయం చక్కగా పనిచేస్తుంది. 50 మి.లీ. మోదుగ కాషాయం తయారుచేయాలి. చల్లారిన తర్వాత చక్కెర కలిపి తాగాలి. మోదుగ జిగురులో కొంచెం చక్కెర లేదా బెల్లం కలిపి.. పాలు లేదంటే ఉసిరి రసంతో కలిపి తాగితే.. ఎముకల దృఢమవుతాయి. గోరువెచ్చనీ నీటిలో మోదుగ జిగురు కలుపుకొని తాగితే.. విరేచనలు తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. మోదుగకు డిమాండ్ బాగా ఉంది. రేటు కూడా బాగా లభిస్తుంది. మీరు ఈ పువ్వులను ఎండబెట్టి అలాగే అమ్మవచ్చు. లేదంటే పొడి చేసి కూడా విక్రయించవచ్చు. ఇందుకోసం ఆమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లతో ఒప్పందం చేసుకోవచ్చు.

First published:

Tags: Agriculture, Business Idea, Local News, Nagar kurnool

ఉత్తమ కథలు