హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మకుమారీస్.., మానవత్వం, ఆధ్యాత్మికతను తట్టి లేపుతూ బోధనలు

Nagarkurnool: గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మకుమారీస్.., మానవత్వం, ఆధ్యాత్మికతను తట్టి లేపుతూ బోధనలు

నాగర్

నాగర్ కర్నూల్ గ్రామాల్లో బ్రహ్మకుమారీల బోధనలు

Nagar Kurnool: బ్రహ్మకుమారీస్ జ్ఞాన బోధన, ఆధ్యాత్మికత విషయాలు గ్రామీణ స్థాయి వరకు విస్తరిస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో దైవ చింతన, ఆత్మజ్ఞానం, ధ్యానం వంటి అంశాలను ప్రేరేపించేలా వీరి బోధనలు ఉంటున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  బ్రహ్మకుమారీస్ జ్ఞాన బోధన, ఆధ్యాత్మికత విషయాలు గ్రామీణ స్థాయి వరకు విస్తరిస్తున్నాయి. ప్రతి ఒక్కరిలో దైవ చింతన, ఆత్మజ్ఞానం, ధ్యానం వంటి అంశాలను ప్రేరేపించేలా వీరి బోధనలు ఉంటున్నాయి. మనుషుల్లో పెరిగిపోతున్న విపరీత ధోరణి, మానసిక ఒత్తిళ్లను దైవ చింతన ద్వారా మాత్రమే అదుపులో పెట్టుకోగలమని బ్రహ్మకుమారీస్ బోధిస్తున్నారు. ఈ సంస్థ కార్యక్రమాలు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో కూడా ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి ఇపుడిపుడే గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వీరి బోధనలకు ఆకర్షితులవుతున్నారు. 1937లో ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని కరాచీలో స్థాపించారు. దేశ విభజన అనంతరం 1952లో రాజస్థాన్లోని మౌంట్ అబూ ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు 140 దేశాలలో విస్తరించి ఆధ్యాత్మిక బోధనలు కొనసాగిస్తున్నారు.

  నాగర్ ‌కర్నూల్ జిల్లాలో 2017 నుంచి వీరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బ్రహ్మకుమారిస్ తమ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వ్యక్తి కూడా తన గురించి తాను తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి, రాజయోగం పొందడానికి, తాము బోధనలు చేస్తామని ఇక్కడి నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఆధ్యాత్మిక బోధనలు వివరిస్తూ వస్తున్నామని తెలిపారు.

  ఇది చదవండి: కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము చెదల పాలు.., వృద్ధ దంపతులకు తీరని కష్టం

  హిందూ సాంప్రదాయం ప్రకారమే: పూర్తిగా హిందూ దేవుళ్లను ఆరాధిస్తూనే తమ సాంప్రదాయ పద్ధతులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరిని సోదరసోదరీ భావంతో మెలుగుతూ తమ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. హిందూ సంస్కృతికి సంబంధించిన పండుగలు, ఉత్సవాలు, కార్యక్రమాలు అన్నీ తాము సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానంగా మహాశివుడికి సంబంధించి మహా శివరాత్రి రోజున తమ కార్యక్రమాలు ప్రజలకు కనువిప్పు కలిగేలానిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. వీటితోపాటు హిందూ సాంప్రదాయక పండుగలైన నవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి పండుగలు, రాఖీ పండుగలు, వంటివి ఎందుకు నిర్వహించుకోవాలి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? వాటిని గురించి పురాణాల్లో ఏం చెబుతున్నారు? అనే అంశాలను ప్రజలకు అర్ధమయే రీతిలో బోధిస్తామని చెప్పుకొచ్చారు. కుటుంబం వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూనే బ్రహ్మకుమారీస్ ధ్యాన బోధలను తెలుసుకోవచ్చని నిర్వాహకురాలు విజ్ఞాని న్యూస్ 18కు వివరించారు.

  ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

  దైనందిన కార్యక్రమాలు: బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు కార్యక్రమాల ద్వారా మనిషి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా బోధనలు ఉంటాయని విజ్ఞాని వివరించారు. ఆత్మజ్ఞానం పొంది భగవంతుడిపై నమ్మకం పెరుగుతుందని, భగవద్గీతలో తెలిపినటువంటి ఎన్నో గొప్ప విషయాలను తాము ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ధ్యాన బోధ కార్యక్రమాలు నిర్వహించి ఆధ్యాత్మికతను విస్తరింప చేస్తున్నామని చెప్పారు.

  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తమ ఆశ్రమాలు ఉన్నాయని నిర్వాహకులు వివరించారు. బ్రహ్మకుమారీస్ వద్దకు వచ్చినవారు ఎవరు కూడా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కేవలం తమ బోధనలు విని ఆత్మజ్ఞానం పొంది, జీవితాన్ని సుఖప్రదం చేసుకుంటే చాలని బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana