హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP: పాలమూరుపై బీజేపీ ఫోకస్.. పట్టు సాధించేందుకు వ్యూహరచన

BJP: పాలమూరుపై బీజేపీ ఫోకస్.. పట్టు సాధించేందుకు వ్యూహరచన

పాలమూరుపై బీజేపీ దృష్టి

పాలమూరుపై బీజేపీ దృష్టి

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) పై పట్టు సాధించేందుకు బీజేపీ (BJP) నేతలు వ్యూహ రచిస్తున్నారు. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని నియోజకవర్గాల మినహాయిస్తే మిగిలిన అన్నిచోట్ల పార్టీ బలంగా ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar (Mahabubnagar) | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) పై పట్టు సాధించేందుకు బీజేపీ (BJP) నేతలు వ్యూహ రచిస్తున్నారు. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్ని నియోజకవర్గాల మినహాయిస్తే మిగిలిన అన్నిచోట్ల పార్టీ బలంగా ఉంది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంతోపాటు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు నేతలు అడుగులు ముందుకు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి వివిధ పార్టీల నుంచి ముఖ్య నాయకులను చేర్చుకొని పనిలో ఉన్నారు. టికెట్లు ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం మీద వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాలు గెలిచి సత్తా చాటాలని న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ స్థాయి నాయకులు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డిలు, ఆచారి వంటి జాతీయ స్థాయి నాయకుల వలన చాలావరకు ప్రభావం చూపగలుగుతుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. వీరి ద్వారా పార్టీని పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే గ్రామస్థాయిలో నుంచి బూత్ స్థాయి లీడర్లను వరకు లీడర్లను నియమించుకొని బీజేపీ తన బలాన్ని రోజురోజుకు పెంచుకుంటుంది. ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో టిఆర్ఎస్ పార్టీని ఢీకొనేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇది చదవండి: సొంత శాఖ నుండే ప్రక్షాళన.. విధి నిర్వహణలో నాలుగే సింహమే

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో చాలా సందర్భాల్లో అత్యంత వెనుక బడిన పాలమూరు జిల్లాను ఉదాహరణగా చూపించి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. పాలమూరు జిల్లా కోసం అయినా తెలంగాణ రాష్ట్రం కావాలని సెంటిమెంట్ ను రగిలించారు. మన రాష్ట్రం మనకు వస్తే నీళ్లు నిధులు దక్కడంతో పాటు నియామకాలు జరుగుతాయని ఉద్యమ సమయం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు బిఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని పలు మాటలు హామీ ఇచ్చారు.పాలమూరు రంగారెడ్డి ద్వారా నల్గొండ జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగునీటిని మూడేళ్లలో అందించి తీరతామని ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ హామీ ఇచ్చారు.కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రాజెక్టుకు సంబంధించిన సగం పనులు కూడా పూర్తికాలేదు. పలు కారణాలతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొన్నిచోట్ల పెండింగ్ పనుల ద్వారా నీటి వనరులు కల్పించడం అప్పటికి ఆ సాగునీరు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది.

ఇది చదవండి: ఆ జిల్లా వాసుల రోడ్డు కష్టాలు తీరినట్లే.. కలెక్టర్ ఏమన్నారంటే..!

దీనికి తోడు అధికార పార్టీ నేతలు జిల్లాలో వలసలు ఆగిపోయాయనిఅని పదేపదే చెప్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఇంకా వలసలు తగ్గలేదు. వీటితోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా (Mahbubnagar District) లో పలు రిజర్వాయర్ నిర్మా ణాలు కూడా జరగలేదు. ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు వివరించడంతోపాటు అధికార ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ వ్యూహాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే బండి సంజయ్ తన రెండో విడత ప్రజా సంఘాల యాత్రను అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి శ్రీకారం చుట్టారు.ఇప్పుడు మరోసారి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని సైతం ఇక్కడే నిర్వహించుకోవాలని ప్రణాళికలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకుంటామన్న ధీమాతో ఆ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికీ గద్వాల, మక్తల్, నారాయణపేట, మహబూబ్నగర్, కల్వకుర్తి, కొల్లాపూర్ లో కొంతమేర పట్టు ఉన్న బిజెపి వరుస కార్యక్రమాల నిర్వహణతో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పట్టు సాధించేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు జరగడంలేదు, ఎన్నికలలో బలమైన పోటీ ఇచ్చే నేతలు కూడా లేరు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వివిధ పార్టీల నుంచి ముఖ్య నాయకులను టికెట్ దక్కకుండాఅసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి బిజెపి నేతలు వ్యూహాలు రచించి అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఇకనుంచి జరిగే వరుస కార్యక్రమాలు పార్టీని బలోపేతంచేసేందుక ఉపయోగపడతాయని పార్టీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Mahbubnagar, Telangana, Telangana bjp

ఉత్తమ కథలు