హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: తెలంగాణలో గ్రామాలపై పట్టుబిగిస్తున్న బీజేపీ.. గ్రామీణ స్థాయిలో భారీగా చేరికలు

Nagarkurnool: తెలంగాణలో గ్రామాలపై పట్టుబిగిస్తున్న బీజేపీ.. గ్రామీణ స్థాయిలో భారీగా చేరికలు

ఈటల రాజేందర్, బండి సంజయ్

ఈటల రాజేందర్, బండి సంజయ్

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన బీజేపీ (BJP), తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగురవేసేందుకు సిద్ధం అవుతుంది. గ్రామీణ, పట్టణ వార్డు స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణపై క్రమంగా బీజేపీ పట్టుబిగుస్తుంది.

(N.Naveen Kumar, News18, Nagarkurnool)

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికారం చెప్పటడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందిన బీజేపీ (BJP), తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగురవేసేందుకు సిద్ధం అవుతుంది. గ్రామీణ, పట్టణ వార్డు స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణపై క్రమంగా బీజేపీ పట్టుబిగుస్తుంది. ఈక్రమంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఆదేశాలు రావడంతో నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలో ఆ పార్టీ నాయకులు కార్యక్రమాలను ముమ్మరం చేశారు. బూత్ లెవల్‌లో కమిటీలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 443 గ్రామ పంచాయితీలకు పార్టీని విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ చేరికల అనంతరం ప్రధాని మోదీ సూచించిన 7 ప్రధాన సూత్రాలను అమలు చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీలో ఉమ్మడి పాలమూరుకు చెందిన సీనియర్ నాయకులు డీ.కే అరుణ, ఏ.పీ జితేందర్​ రెడ్డి సభ్యులుగా ఉండటంతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

రాష్ట్ర స్థాయితో కమిటీల ఏర్పాటు..

రానున్న సాధారణ ఎన్నికల్లో అధికారాన్ని సొంత చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. గ్రామీణ స్థాయిలో (Village level) విస్తరించేందుకు తగిన కార్యచరణ చేపట్టింది. ఇటీవల జరిగిన బీజేపీ (BJP) కార్యవర్గ సమావేశం అనంతరం రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి పార్టీ వెళ్లాలంటే బూత్ లెవల్ కమిటీలను (Booth level committee) ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వంలో 3 ప్రధాన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈటెల రాజేందర్ కన్వీనర్‌గా పార్టీలో చేరికల అంశం, ఫైనాన్స్ కమిటీ కన్వీనర్‌గా ఏ.పీ జితేంధర్ రెడ్డి, ప్రజాసమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయాన కమిటీ కన్వీనర్ గా ఎంపీ ధర్మపురి అరవింద్ ను పార్టీ జాతీయ నాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన సీయర్ నాయకులు డీకే అరుణ, ఏపి జితేందర్ రెడ్డిలు ఉండటంతో జిల్లా కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందని చెప్పవచ్చు.

గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు:

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానించిన అంశాలను అమలు చేసేందుకు నాగర్‌కర్నూల్ జిల్లా నాయకత్వం సిద్ధమవుతుంది. గ్రామీణ స్థాయిలో వాటిని పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాలోని 20 మండలాల వారిగా ప్రధాన నాయకులకు బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 445 గ్రామ పంచాయితీల్లో బూత్ లెవల్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల నాటికి గ్రామీణ స్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జిల్లా పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందకు సంబంధించి ఇప్పటికే జిల్లా నాయకులు పలు సమావేశాలను నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం గ్రామాల్లో కార్యకర్తలతో బీజేపీ నేతల సమావేశాలు.
నాగర్​కర్నూల్​లో పార్టీ సభ్యత్వ నమోదు అనంతరం  కార్యకర్తలతో బీజేపీ నేతలు

మోదీ చెప్పిన 7 ప్రధాన సూత్రాల అమలుకు ఏర్పాట్లు:

ప్రతి ఇంటికి బీజేపీ జెండా చేరేలా "హర్ ఘర్ తిరంగా" పేరుతో భారీ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది బీజేపీ అధిష్టానం. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, పార్టీపై ప్రజల్లో నింపేలా ఏడు సూత్రాలను అమలు చేయనుంది. రామబాణం లాంటి తిరుగులేని ఈ ఏడు సూత్రాల ద్వారా గ్రామీణ స్థాయిలో ఓటర్లను ఆకర్శించనున్నారు బీజేపీ నాయకులు. 1.సేవాభావం, 2. సమన్వయం 3. సంయమనం, 4. సమన్యాయం, 5. సానుభూతి, 6. సానుకూలత, 7. సంభాషణ. ఈ అంశాలను అమలు చేస్తూ అధికార పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేయనున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ అమలు పరుస్తున్న పథకాలను వివరస్తూ, ప్రజల పట్ల సేవాభావంతో మెలుగుతూ ప్రజాసమస్యలపై పోరాటం చేయనున్నారు. సమస్యలపై బాధితుల పక్షనా నిలుస్తూ వారిపట్ల సానుభూతి ప్రదర్శించి సమన్యాయం జరిగేలా కార్యకర్తలు వ్యవహరించనున్నారు. ఇక పార్టీలో కార్యకర్తలు, నాయకులు సమన్వయం చేసుకుంటూ సానుకూలా వాతావరణం ఏర్పడేలా పార్టీ పట్ల విధేయంగా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రజా సమస్యలపై, బీజేపీ కార్యక్రమాలపై అద్బుతంగా ప్రసంగిచేలా ప్రజల్లోకి బీజేపీ సిద్ధాంతాలను తీసుకు వెళ్లేలా సంభాషణలు కూడా చేయనున్నారు.

ఈ వ్యూహాలన్నీ పక్కాగా అమలు చేసి తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పవచ్చు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana bjp, Telangana Politics

ఉత్తమ కథలు