Home /News /telangana /

NAGAR KURNOOL BIKE STOLEN IN TELANGANA STATE RECOVERED IN KARNATAKA STATE POLICE ARRESTS THREE ACCUSED NNK BRV PRV

Nagarkurnool: ఈ దొంగలు మామూలోల్లు కాదు.. తెలంగాణలో దొంగిలించిన బైకులు ఎక్కడ అమ్ముతున్నారో తెలుసా?

నాగర్​ కర్నూల్​ క్రైమ్​

నాగర్​ కర్నూల్​ క్రైమ్​

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బైకులు చోరీ చేసి ఆ బైకులను కర్ణాటక రాష్ట్రంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఉప్పునుంతల మండలంకు చెందిన రైతు మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు

ఇంకా చదవండి ...
    (N.Naveen kumar, News 18, Nagarkurnool)

    తెలంగాణ  (Telangana) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బైకులు (Bikes) చోరీ చేసి ఆ బైకులను కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను మహబూబ్ నగర్ (Mahbubnagar) పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను జడ్చర్ల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారి నుంచి చోరీకి గురైన 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గంకు చెందిన ఇద్దరు.. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన మరొకరు కలిసి ముఠాగా ఏర్పడి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బైక్‌ చోరీలకు పాల్పడుతున్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్, నారాయణపేట, మక్తల్, రాజాపూర్ వంటి ప్రాంతాల్లో గత కొంత కాలంగా వీరు బైక్ చోరీలు చేస్తున్నారు. వాటన్నింటిని కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని నందిపల్లిలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

    ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన దొంగలను విచారించగా పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో మంగళవారం సాయంత్రం జడ్చర్ల క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దేవేందర్, శంకర్, విష్ణు బృందాలు మూడు డీసీఎంలలో నారాయణపేట చేరుకున్నారు. అక్కడి నుండి కర్ణాటక రాష్ట్రం నందిపల్లికి వెళ్లి వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.



    విద్యుత్ షాక్‌తో రైతు మృతి:

    నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలో ఇటీవల విద్యుత్ షాక్‌తో పలువురు మృతి చెందిన ఘటనలు కలవర పెడుతున్నాయి. ఉప్పునుంతల మండలంకు చెందిన రైతు మంగళవారం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మామిళ్ళ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మామిళ్ళపల్లికి చెందిన రైతు దొంతినేని రంజిత్ రావు మంగళవారం తన వ్యవసాయ పొలంలో ట్రాక్టర్ తో దున్నుతున్నాడు.

    స్తంభం వద్ద ఇన్సులేటర్ పగిలి కిందకు వేలాడుతున్న కరెంటు తీగను పక్కకు జరుపుతుండగా వైర్ జారి రైతు రంజిత్ చేతి పై పడటంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్క పొలంలో ఉన్న శేఖర్ ఇది గమనించి సదరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వెంటనే అతడిని వాహనంలో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంజిత్ రావు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అతడికి భార్య రేవతి, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bikes, Crime news, Local News, Nagarkurnool, Theft

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు