Home /News /telangana /

NAGAR KURNOOL AUTO DRIVER MURDERED OVER LOVE AFFAIR IN MAHABUBNAGAR DISTRICT ABH BRV NNK

Nagarkurnool: కూతురు వరుసయ్యే అమ్మాయితో ప్రేమాయణం.. అమ్మాయి అన్న చూసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..?

ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య, మృతుడు సింగిదాసు కృష్ణయ్య

ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య, మృతుడు సింగిదాసు కృష్ణయ్య

ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కృష్ణాపురం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగిదాసు కృష్ణయ్య (25) అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    ప్రేమ వ్యవహారం కారణంగా ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కృష్ణాపురం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగిదాసు కృష్ణయ్య (25) అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తనకు కూతురు వరసయ్యే ఇంటర్మీడియట్ చదివే బాలికతో ప్రేమాయణం సాగించాడు. విషయం తెలిసిన బాలిక అన్నదమ్ములు పలుమార్లు కృష్ణయ్యను హెచ్చరించారు. మంగళవారం రాత్రి పీర్ల పండుగ ఉండడంతో గ్రామస్తులందరూ పొద్దుపోయే వరకు ఆటపాటలతో మునిగారు. ఈ క్రమంలో కృష్ణయ్య ఆ బాలికతో కలిసి గ్రామ శివారులో కలిసి ఉండడాన్ని బాలిక అన్న విజయ్ చూశాడు.

    విషయాన్ని తన సోదరుడు సింగిదాసు మోహన్‌కు తెలియజేయగా...మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చిన అన్నదమ్ములు కృష్ణయ్యను కత్తితో పొడిచారు. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణయ్య తనను బతికించాలని వేడుకోవడంతో... తీవ్రంగా గాయపడిన కృష్ణయ్యను అదే రాత్రి వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ కృష్ణయ్య బుధవారం మరణించాడు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



    లారీ బైకు ఢీకొని ఒకరు మృతి:
    అడ్డాకుల మండలం కందూరు స్టేజి వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి పీర్లగుట్టకు చెందిన తెలుగు రవి (36) పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించే వాడు. మిత్రుడు నరేష్‌తో కలిసి బైక్ పై బుధవారం ఉదయం మహబూబ్‌నగర్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా కందూరు స్టేజ్ దాటిన తర్వాత బైక్ టైరు పంచర్ కావడంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రవి అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన నరేష్ ను చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

    సర్పంచ్ భర్త పై హత్యాయత్నం: నాగర్‌కర్నూల్ జిల్లా బలమురు మండలం మహాదేవపురం గ్రామ సర్పంచ్ భర్త రాంప్రసాద్ గౌడ్ పై హత్యాయత్నం జరిగిందని సర్పంచ్ మయూరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంపిటిసి సభ్యుడు ఆంజనేయులుతో తమకు కొంతకాలంగా రాజకీయ విభేదాలు ఉన్నాయని, దీంతో కక్షగట్టి ఆంజనేయులు..అతని అల్లుడు వినయ్ తో కలిసి మంగళవారం రాత్రి మద్యం సీసాతో తన భర్తపై దాడి చేశారని సర్పంచ్ మయూరి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపైనా దాడి చేశారని, గ్రామస్తులు రావడంతో నిందితులు పారిపోయారని వివరించారు. అదే రోజు సాయంత్రం ఎంపీటీసీ ఆంజనేయులు, అతని అల్లుడు కారులో వచ్చి తనను కారుతో ఢీకొట్టేందుకు యత్నించారనిసర్పంచ్ భర్త రాంప్రసాద్ తెలిపారు. వారి నుంచి తమకు ప్రాణాని ఉందని బల్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Read this: Nagarkurnool: డయాలసిస్ కేంద్రంలో చికిత్స మధ్యలో ఉండగా నిలిచిపోయిన కరెంటు.. ఆందోళనకు గురైన రోగులు
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు