Naveen Kumar, News18, Nagarkurnool
మహబూబ్ నగర్ జిల్లా (Mahboobnagar District) లో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి పనులు చకచగా కొనసాగుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు కోసం టీఎస్ఐఐసి (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి ఇప్పటికే దరఖాస్తులు రావడంతో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్టు స్పష్టమవుతోంది. పాలమూరులో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు అటు మహబూబ్నగర్జిల్లాకు హన్వాడ మండలానికి తలమానికంగా నిలవనుంది. ప్రభుత్వం గత నవంబర్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. హన్వాడ మండల కేంద్రానికి సమీపంలో దాదాపు 500 ఎకరాల్లో ఫుడ్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వ ప్రైవేటు భూములను సేకరించి ఫుడ్ పార్క్ ను తీర్చిదిద్దేందుకు హన్వాడా తహసీల్దార్ బి.శ్రీనివాసులు నేతత్వంలో రెవెన్యూ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు.
ఫుడ్ పార్క్ ఏర్పాట్లను మొదట్లో వ్యతిరేకిచ్చిన రైతులు, ప్రజాసంఘాల నాయకులు మండలంలోని యువతకు దినసరి కూలీలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆలోచనలు తీసుకువచ్చారు. హన్వాడ సమీపంలోని సర్వేనెంబర్ 718లో ఈ ఫుడ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని భావించింది.
మొదటి విడతగా 215.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు చర్యలు ఉపక్రమించింది. ఇందులో 80 ఎకరాల్లో ప్రభుత్వం భూమి ఉండగా 175.7 ఎకరాల్లో లావుని పట్టా భూమి ఉంది. ఈ లావుని పట్టాకు సంబంధించిన 135.7 ఎకరాల విస్తీర్ణంలో 285 మంది రైతులు భూములు సాగు చేసుకుంటున్నట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం గత నవంబర్ 18న జారీచేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ప్రకారం మొదటి విడత సేకరించినట్లు 215.7 ఎకరాల్లో విస్తీర్ణంలో ఎంజాయ్మెంట్ సర్వేను పూర్తి చేసింది.రైతుల వివరాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు వారిగా నమోదైన విస్తీర్ణం వివరాలను క్రోడీకరిస్తూ సాగులో ఉన్నది, సాగులో లేని భూమిని పేర్కొంటూ పంట వివరాలతో పాటు ఇతర సమాచారాన్ని సేకరించారు.
ప్రభుత్వం జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఎంజాయ్మెంట్ ను సర్వే ఆధారంగా రైతులకు పరిహారం చెల్లింపులు ఇతర పునరావాస చర్యలు చేపట్టనున్నారు. ఈనెల 15 వరకు నోటిఫికేషన్ లపై అభ్యంతరాలు స్వీకరించగా 60 మంది రైతులు తమ భూములను ప్రభుత్వ నిబంధనలను మేరకు అప్పగించేందుకు అంగీకారం తెలిపినట్లు తాసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫుడ్ పార్క్ రావడంతో హన్వాడ పరిసర ప్రాంతాల్లో భూములకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఎకరాకు గరిష్టంగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఉన్న భూములు ప్రస్తుతం 30 నుంచి 40 లక్షల మేర పలుకుతున్నాయి. ఎకరా నుంచి రెండు ఎకరాల ఉన్న రైతులు ఫుడ్ పార్క్ రాకతో ఒకంత ధైర్యం నెలకొంది.
ఫుడ్ పార్క్ ఏర్పాటుతో అందరి దృష్టి హన్వాడ మండలంపై పడింది. పనులు త్వరలో ప్రారంభం అవుతుండడంతో టిఎస్ఐఐసి ఆధ్వర్యంలో మౌలిక వసతులను కల్పనపై దృష్టి సారించారు. సేకరించిన భూములను టిఎస్ఐఐసికి అప్పగించిన వెంటనే ఈ ప్రక్రియ చేపడుతారు. రోడ్డు విస్తరణతో పాటు పరిశ్రమ స్థాపనకు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా భూ కేటాయింపులు, విద్యుత్తు, నీళ్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తారు. 167 జాతీయ రహదారి నుంచి 100 ఫీట్ల రోడ్డును ఫుడ్ పార్క్ కు కలుపనున్నారు. అందుకు సంబంధించిన సర్వేలను సైతం పూర్తి చేశారు.ఇదిలా ఉండగా ఫుడ్ పార్క్ లో ఆహార శుద్ధి పరిశ్రమను స్థాపించేందుకు ఇప్పటికే 55 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana