దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపైన ఏర్పాటు చేసిన టోల్ లో వసూలు చేసే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్ ఒకటి అర్ధరాత్రి నుంచి ఈ పెంచిన టోల్ చార్జీలు అమలులోకి రానున్నాయి. జాతీయ రహదారిపై వెళ్లేటువంటి ప్రతి వాహనాలకు కూడా ఇవి వర్తించనున్నాయి. చిన్న వాహనాల పైన 15 రూపాయలు పెద్ద వాహనాల పైన 35 రూపాయలను టోల్ ఛార్జీలను పెంచడం జరిగింది.
దీంతో దాదాపుగా ప్రతిరోజు 800 కోట్ల మేర అదనపు ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరనుంది. 2014లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో పెంచిన టోల్ ఛార్జీలను మళ్లీ ప్రస్తుతం 2023 ఏప్రిల్ 1న పెంచడం జరిగింది. ఈ పెంపుదల పైన పలు ప్రజా సంఘాలు ట్రాన్స్ పోర్ట్ వాహన యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల వలన ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం భారీగా నష్టాలు చవి చూస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడుగా మళ్లీ టోల్ఛార్జీలను కూడా పెంచడంతో మరింత కుదిలయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ టోల్ ఛార్జీలు పెరగడం వలన ఈ ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడనుంది. రవాణా చేసే భారీ వాహనాల పైన టోల్ ఛార్జీలు ప్రతి టోల్ గేట్ దగ్గర 35 రూపాయల చొప్పున చెల్లించడంతో దిగుమతి చేసుకునే నిత్యవసర వస్తువుల ధరలపై ఈ ప్రభావం పడనుంది. దీంతో వీటి ధరలకు అనుగుణంగా నిత్యవసర ధరలు, తిను బండారాలు, వంట సరుకులు ధరలు కూడా అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు మరింత ధరలు పెరగడం ఒకంత కష్టతరమని చెప్పుకోవచ్చు. దీని పట్ల కేంద్ర ప్రభుత్వం పున పరిశీలన చేసి మళ్లీ టోల్ ఛార్జీలను తగ్గించాలని నాగర్ కర్నూల్ జిల్లాలో ట్రాన్స్ పోర్ట్ యజమానుల సంఘం తరఫున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే టోల్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana