హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: ఇకపై యాప్ లో అంగన్ వాడీ వివరాలు

Nagar Kurnool: ఇకపై యాప్ లో అంగన్ వాడీ వివరాలు

అంగన్ వాడీ యాప్

అంగన్ వాడీ యాప్

Nararkurnool: అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి వివరాలు ఇక ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. సెంటర్లలో ఎంత మంది చిన్నారులు హాజరవుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి వివరాలు ఇక ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. సెంటర్లలో ఎంత మంది చిన్నారులు హాజరవుతున్నారు, గర్భిణీలు,బాలింతలు,కిషోర్ బాలికల వివరాలు సెంటర్ కి వచ్చే సరుకుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్ హెచ్ టి ఎస్) పేరుతో యాప్ను రూపొందించి కేంద్రాల నిర్వహణ వివరాలను గతంలో రిజిస్టర్లు నమోదు చేసేవారు. ఆన్లైన్ తో ఈ వ్యవస్థకు పుల్ స్టాప్ పడింది.

ఇప్పటికప్పుడు వివరాలను మొబైల్ లో టీచర్లు నమోదు చేయాలి. సూపర్వైజర్లు సిడిపిఓలు, డిడబ్ల్యూఓ వీటన్నిటిని కూడా పర్యవేక్షణ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, బాలింతలు, కిశోర బాలికల వివరాలు వారికి అందించే పౌష్టికాహారంతో పాటు ఎత్తు కొలతలు కేంద్రానికి వచ్చే సరుకుల వివరాలు మొత్తం ఇకపై ఆన్లైన్లో నమోదుకానున్నాయి. ఈ సమాచారం అంతా అంగన్వాడీ టీచర్లు రిజిస్టర్ లతో పాటు యాప్ లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి టీచర్లందరికీ స్మార్ట్ మొబైల్ ఫోన్లు అందజేస్తుంది. ప్రస్తుతం పొందుపరుస్తున్న15 అంశాలను నమోదు చేసేందుకుప్రత్యేక ఆప్ ను రూపొందించారు. అంగన్వాడి టీచర్లు అన్ని వివరాలు యాప్ లోనే పొందుపరచాల్సి ఉంటుంది.సూపర్వైజర్లు సిడిపివోలు, డిడబ్ల్యుఓలు వివరాలను పర్యవేక్షిస్తారు. న్యూట్రిషన్ అండ్ టాకీస్ సిస్టం అంగన్వాడి కేంద్రానికి వచ్చే లబ్ధిదారులు పౌష్టికాహారం ఏ మేరకు అందుతుంది.

ఎక్కడైనా పంపిణీ చేయకుండాఉన్నాయా అనే అంశాలను యాప్ ద్వారా పరిశీలన చేయనున్నారు. ఇకపై యాప్లో నమోదు చేసిన వివరాలు ద్వారా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసి ప్రత్యేక యాప్ ను రూపొందించింది.ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజు వారీగా పోస్ట్ వివరాలను ఈ యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. అంగన్వాడి కేంద్రాల నుంచి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికారాన్ని అందిస్తున్నారు. గర్భిణీలు తీసుకునే పౌష్టికాహారం వల్లే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా బరువు ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చేంతవరకు పౌష్టికాహారని అందిస్తున్నారు.

చిన్నారి ఎత్తు బరువు భుజం చుట్టు కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం వయస్సు తగిన ఎత్తు బరువు ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అనే విషయాలను ఎప్పటికప్పుడు యాప్ లో పొందుపరచాలి. పూర్తి వివరాలు మరింత పోష్టికారాన్ని అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ లో ఉండే 15 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు చిన్నారుల ఎత్తు, కొలతలు, పౌష్టికాహారం అందజేత వంటితో పాటు అంగన్వాడి కేంద్రాల్లో నిలువ ఉన్న పౌష్టికాహారం సమాచారాన్నిడీడబ్ల్యఓ ఎప్పటికప్పుడుపర్యవేక్షించనున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు