హోమ్ /వార్తలు /తెలంగాణ /

మేకలు, గొర్రెల దొంగల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. లక్షల విలువ చేసే దొంగతనాలు!

మేకలు, గొర్రెల దొంగల అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్.. లక్షల విలువ చేసే దొంగతనాలు!

దొంగల ముఠా అరెస్టు

దొంగల ముఠా అరెస్టు

Telangana: మేకలు, గొర్రెల మందలను టార్గెట్గా చేసుకొని తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వనపర్తి జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

మేకలు, గొర్రెల మందలను టార్గెట్గా చేసుకొని తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వనపర్తి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎక్కడైనా మందలుగా మేకలు లేదా గొర్రెలు కనిపిస్తే వాటిపై రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేస్తూ వస్తున్నారు. గత రెండు నెలలుగా వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరుసగా మేకలు, గొర్రెలు దొంగతనాలకు గురయ్యాయి. బాధితులనుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు ఈ దొంగలను పట్టుకొవడంపై దృష్టి సాధించారు. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా దృష్టిపెట్టిన పోలీసులు ఎట్టకేలకు చిన్నంబాయి మండలం దగ్గర మేకలను ఎత్తుకెళ్లే దొంగలను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువులను ఎత్తుకెళ్లే దొంగల ముఠా ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. వీరి నుంచి లక్ష 30 వేల రూపాయల నగదు, మినీ డీసీఎం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నంబావి మండలం దగ్గర సిసిఎస్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఎరుకలి అంజనేయులు, నాసరి కులయప్ప, మనపాటి నరేష్, మనపాటి సూరి అలియాస్ సౌదయ, ఉలవల రాఘవేందర్, గజ్జల రమేష్ ను అదుపులోకి తీసుకొని మినీ డీసీఎం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నేరస్తులు శ్రీను, కర్ణాటక లడ్డు పరారీలో ఉన్నట్టు చెప్పారు.

ఫిబ్రవరి 7వ తేదీన కొత్తకోట మండలం విలియం కొండ గ్రామానికి చెందిన గోపాల్ నాయక్ తన 30 మేకలలో 25 మేకలు రాత్రి అదృశ్యం అయ్యాయని ఫిర్యాదు ఇచ్చాడు. పెద్ద దగడ గ్రామానికి చెందిన అదేం శ్రీనివాసులు ఫిబ్రవరి 17వ తేదీన తన ఇంటి పక్క ఖాళీ స్థలంలో నిలిపి ఉంచిన మేకలలో 15 మేకలు కనిపించడం లేదని ఫిర్యాదు ఇచ్చారు. నేరస్తులను విచారించగా ఇందుకు సంబంధించిన మేకలను తామే దొంగలించామని నిందితులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా బనగానపల్లి పశువుల మార్కెట్లో మేకలను విక్రయించి1,30,000 రూపాయలనుసమానంగా వాట పంచుకున్నామని ఒప్పుకున్నారు. తెలంగాణలోని వనపర్తి , నాగర్ కర్నూల్ , గద్వాల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రకాశం జిల్లా పొదిలి, దర్శి, కంభం, బెస్తవారిపేట ప్రాంతాల్లో కూడా తాము దొంగతనాలకు పాల్పడ్డామని అంగీకరించారు. వీరంతా యువకులే కాగా.. మద్యానికి బానిసై, జల్సాలకు అలవాటు పడి ఈ చోరీలకు దిగినట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు