హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె పోటు నుండి రక్షించే ఇంజెక్షన్!

ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె పోటు నుండి రక్షించే ఇంజెక్షన్!

గుండెపోటు నిరోధించే చర్యలు

గుండెపోటు నిరోధించే చర్యలు

Telangana: ఒకప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల గురించి వినడం చూడడం చాలా అరుదుగా ఉండేది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఒకప్పుడు గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధుల గురించి వినడం చూడడం చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవల రోజూ వింటూనే ఉన్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్నతనంలోనే హార్ట్ ఎటాక్ తో ఎందరో ప్రాణాలు హరి అంటున్నాయి. ఎవరికైనా గుండెపోటు వస్తే అత్యవసర సమయంలో వెంటనే చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్య శాఖ సిద్ధమైంది. వెంటనే స్పందించి దవాఖానాకు తీసుకెళ్లే వారిని కాపాడేలా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు టెనెక్స్ట్ ప్లాసా ఇంజెక్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆపత్కాలంలో ఎవరైనా దవాఖానకు వస్తే వారి ప్రాణాలు కాపాడేందుకు ఇంజక్షన్ సిద్ధంగా ఉన్నాయని సూపరిండెంట్ కిషోర్ తెలిపారు.

గుండెపోటు మరణాలు ఈమధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తుంటే కుప్పకూలుతున్న ఘటనలు చూస్తున్నాం. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, కూర్చున్న చోటే ఇలా తనువు చాలిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అదే సరైన సమయంలో స్పందించి దవాఖానాకు తీసుకెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. వెంటనే చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టే వైద్య సదుపాయం జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో ఎప్పటికప్పుడు పెను మార్పులు తీసుకొస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రజలకు అందిస్తుంది.

అందులో భాగంగానే గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి అధునాతన టెక్నాలజీ ఉన్న ఈసీజీ టెనెక్స్ట్ ప్లాజా ఇంజక్షన్లు అందుబాటులో ఉంచింది. దీనితో పాటుగా ఏఈడి మిషన్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హార్ట్ అటాక్ ను మాయో కార్డియాక్ ఇన్ఫెక్షన్ అని కూడా పిలుస్తారు. గుండెకు తగిన మోతాదులో రక్త సరఫరా కాకపోతే హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండెలో ఉండే సెల్స్ కండరాలు జీవించి ఉండాలంటే అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావాలి. ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోతే వెంటనే చికిత్స నిర్వహించాలి. అలా కాని పక్షంలో ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, ఊపిరితిత్తుల్లో బ్లాక్ క్లాట్ అవడం వాటిని గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

గుండెపోటు తీవ్రత ముందే గుర్తించి చికిత్స అందిస్తే వ్యక్తిని కాపాడుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈసీజీ ద్వారా ప్రతినెల 50 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పైగా టెస్టులు చేశారు. వారిలో గుండెపోటు నిర్ధారణ అయినవారికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. వచ్చే రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. కార్పొరేట్ దవాఖానలలో ఉండే టెనెక్స్ట్ ప్లాజా ఇంజక్షన్ ఇక్కడ అందుబాటులో ఉంచారు. మార్కెట్లో ఈ ఇంజక్షన్ 25 వేల నుంచి 30 వేల వరకు ఉంటుంది. వ్యాధి తీవ్రతను బట్టి పూర్తి అనుభవం ఉన్న డాక్టర్ సమక్షంలోనే రోగులకు ఇంజక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్ ఇచ్చిన 12 గంటల్లోగా మెరుగైన చికిత్స తీసుకోవాలని ఉంటుంది. ఇలా ఇప్పటివరకు ఎనిమిది మందికి ఇంజక్షన్ ఇచ్చారు. వారంతా మెరుగైన చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు