హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: పట్టణంలో కనిపించని పొలిటికల్ లీడర్లు.. ఎక్కడికి వెళ్లారబ్బా?

Nagarkurnool: పట్టణంలో కనిపించని పొలిటికల్ లీడర్లు.. ఎక్కడికి వెళ్లారబ్బా?

నాగర్ కర్నూల్‌లో కనిపించని నేతలు

నాగర్ కర్నూల్‌లో కనిపించని నేతలు

గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీల నాయకులు ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాల్లో కనిపించడం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

Naveen Kumar, News18, Nagarkurnool

గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని పార్టీల నాయకులు ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాల్లో కనిపించడం లేదు. అందరూ వెళ్లి మునుగోడులో తిష్ట వేశారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా మునుగోడుకు వెళ్లి తమ తమ పార్టీలను గెలిపించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాగర్ ‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రం నుంచి టిఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP), సిపిఎం (CPM), సిపిఐ (CPI) సహా బీఎస్పి (BSP) పార్టీల నాయకులు ఒక్కరు కూడా కనిపించడం లేదు. గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు నగరంలో ఎవరు ఏ ఆందోళన చేపట్టినా, ఏ ధర్నా కార్యక్రమం చేపట్టినా అక్కడికి ప్రత్యక్షమై బాధితులకు అండగా న్యాయం చేయాలంటూ పోరాడుతుండేవారు.

రాజకీయ ప్రశ్నలు, విమర్శలు ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు మాటల దాడులు చేసుకునే వారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన వాటిలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఎత్తిచూపే ప్రతిపక్ష నాయకులు హడావిడి గత పది రోజులుగా కనిపించడం లేదనే చెప్పాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరై తమ ప్రభుత్వ పథకాలను వివరించేవారు. ఇలాంటి కార్యక్రమాలతో నిత్యం జిల్లా కేంద్రంలో ఏదో ఒక హడావిడి జరుగుతూ ఉండేది.

ఇది చదవండి: భద్రాద్రి రామాలయ భూములపై ముదురుతున్న వివాదం.. రంగంలోకి వీహెచ్‌పీ

అయితే ఇప్పుడు నాగర్ ‌కర్నూల్ జిల్లా ఒక్కసారిగా మూగబోయిందా అనే విధంగా చడీచప్పుడు లేదు. ఏ ఒక్క లీడర్ కూడా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోనూ అదేవిధంగా చుట్టుపక్కల నియోజకవర్గంలో కనిపించడం లేదు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉపఎన్నికలో (Munugodu By Election) తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఆయా నాయకులంతా వెళ్లి అక్కడ తిష్ట వేశారు. గ్రామాల్లో వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు నాయకులంతా మూకుమ్మడిగా వెళ్లిపోవడంతో ఎవరు స్థానికంగా కనిపించడం లేదు. ఈనేపథ్యంలోనే మునుగోడులో ఒక్కసారిగా రాజకీయ నాయకుల రద్దీ పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు.

మునుగోడుకు వెళ్లిన నాయకులు కొంతమంది చెప్పిన వివరాలు అక్కడ ఒక రూమ్ అద్దెకు తీసుకునేందుకు రెండు మూడు రోజులకు 10000 రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇతర ప్రాంతాల నాయకుల రాకతో లాడ్జిలు, హోటళ్లు అదేవిధంగా ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయని తెలుస్తుంది. ఇప్పుడు మునుగోడుకు వెళ్లాలంటే రోడ్డుపైన పడుకోవాల్సిన పరిస్థితని, కనీసం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు కూడా అవకాశంలేని కనీస వసతులు లేవని అక్కడికి వెళ్లిన నేతలు అంటున్నారు. ఇంతటి ఇబ్బందుల్లోనూ తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేతవరకు అక్కడి నుంచి కదిలేది లేదనే ఉద్దేశంతోనే ఆయా పార్టీల నాయకులందరూ మునుగోడులో మకాం వేశారు.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు