హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ప్రభుత్వం, కలెక్టరేట్​ ఉందా? లేదా? దళితులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా?

Nagarkurnool: ప్రభుత్వం, కలెక్టరేట్​ ఉందా? లేదా? దళితులకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా?

X
నాగర్​కర్నూల్​

నాగర్​కర్నూల్​ మెడికల్​ కాలేజీ

దళితులను మోసం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే, కలెక్టర్లు అన్యాయంగా పేదల భూమిని సొంతం చేసుకున్నారని నాగర్‌కర్నూల్ జిల్లాలో అఖిలపక్ష నేతలు మహా ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తూ

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

(Naveen Kumar, News18, Nagarkurnool)

దళితులను (Dalits) మోసం చేసి టీఆర్​ఎస్​ (TRS) ప్రభుత్వం, ఎమ్మెల్యే, కలెక్టర్లు అన్యాయంగా పేదల భూమిని సొంతం చేసుకున్నారని నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలో అఖిలపక్ష నేతలు మహా ధర్నా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తూ ఉయ్యాలవాడ దళిత రైతులకు అన్యాయం చేస్తున్నారని, మెడికల్ కళాశాల భూ నిర్వాసితులకు (For land dwellers) న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2013 యాక్ట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు శనివారం కలెక్టరేట్ ముట్టడించారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), సీపీఎం (CPM), బీఎస్పీ, జనసేన (Janasena) పార్టీల నేతలు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ చేరుకొని నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి (Janardhan reddy) మాట్లాడుతూ దళిత రైతులను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వలాభం కోసం దళిత రైతుల భూములను అక్రమంగా కాజేసారని ఆరోపించారు. మెడికల్ కళాశాల నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారాన్ని అందే వరకు న్యాయపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వం, కలెక్టరేట్ ఉందా? లేదా? అని ప్రశ్నించిన జనార్దన్ రెడ్డి దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వ ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. దళితుల భూములను గుంజుకున్న వారికి బుద్ధి చెప్పాలని ఐక్యమత్యంగా పోరాటం చేయాలని, దళితుల జోలికి వస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కులను కాలరాస్తే న్యాయ పోరాటానికి దిగతామని హెచ్చరించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ దళితుల భూములను లాక్కున్న టీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా కలిసి టీఆర్ఎస్ నేతలకు వత్తాసూపలికి కోట్లాది రూపాయల విలువ చేసే భూములను లక్షల రూపాయలు ఇచ్చి దళిత రైతులను వంచించారని ఆరోపించారు. వెంటనే భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని లేదంటే భూములను తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

భూకబ్జాలు, రౌడీ ఇజానికి నిదర్శనంగా టీఆర్ఎస్ పరిపాలన..

పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడి కొందరు అధికార పార్టీ నాయకులూ భూములపై దౌర్జన్యం చేస్తున్నారని ఈ అన్యాయాన్ని సహించేది లేదని దేనికైనా సిద్ధమని హెచ్చరించారు. భూకబ్జాలకు రౌడీ ఇజానికి నిదర్శనంగా టీఆర్ఎస్ పరిపాలన తయారవుతుందని ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌లో ఏ అక్రమ వ్యవహారం జరిగినా ఎమ్మెల్యే హస్తం ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల నుంచి తీసుకున్న భూమిలో విషయంలో జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, ఇందులో జిల్లా కలెక్టర్, ఎస్పీ దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

Rajanna Sircilla: నాటుసారాపై పోలీసుల ఉక్కుపాదం.. పీడీ యాక్టు నమోదుకు రంగం

బీజేపీ నేత దిలీపచారి మాట్లాడుతూ దళితులను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రూ. కోట్లు విలువ చేసే భూములను మాయమాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చౌకగా కొట్టేసారని, దానిని ప్రభుత్వానికి దానం ఇస్తున్నట్టుగా చిత్రీకరించారని ఆరోపించారు. దళితులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని సుప్రీంకోర్టు వరకు అయినా వెళ్లి భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కొట్లాడుతామని తెలిపారు. ఈ అంశంపై పెద్ద ఎత్తున తరలివచ్చిన విపక్షాలు కలెక్టరేట్ కార్యాలయం ముందు గంటల తరబడి నిరసన తెలిపాయి. కలెక్టర్‌కు వినతిపత్రం అందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై స్పందించిన కలెక్టర్ సోమవారం అఖిలపక్షం నేతలతో, దళిత సంఘాలతో, నిర్వాసితులతో చర్చలు జరిపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.

First published:

Tags: Land dispute, Local News, Medical college, Nagarkurnool

ఉత్తమ కథలు