హోమ్ /వార్తలు /తెలంగాణ /

నకిలీ విత్తనాలు ఇలా గుర్తించండి..! రైతులు ఇది తప్పక తెలుసుకోవాలి

నకిలీ విత్తనాలు ఇలా గుర్తించండి..! రైతులు ఇది తప్పక తెలుసుకోవాలి

X
seed

seed

లూజు లేదా నకిలి మూటల్లో కట్టినటువంటి విత్తనాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

N.Naveen Kumar,News18,Nagarkurnool

వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోంది. రైతులందరూ విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఫర్టిలైజర్ షాపులో విత్తన విక్రయ కేంద్రాల్లో విత్తనాల కోసం పరుగులు పెడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే రైతులు విత్తనాల సాంద్రత, నాణ్యత, సాగు విషయంలో ఎటువంటి మెలుకువలు తీసుకోవాలని అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

విత్తన మేళా కార్యక్రమం పేరుతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాలెం వ్యవసాయ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు హాజరయ్యారు. పాలెం వ్యవసాయ కేంద్రం డైరెక్టర్ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ విత్తనమేల కార్యక్రమంలో పలు అంశాలను సూచనలను రైతులకు అధికారులు వివరించారు.

రైతులు విత్తనాలను కొనుగోలు చేసే ముందు ఆయా విత్తనాలకు సంబంధించిన సాంద్రత నాణ్యత సాగు అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన విత్తనాలు మాత్రమే వినియోగించాలని సూచనలు చేశారు.

ఇందులో భాగంగానే వరి, పచ్చి రొట్ట, జొన్న, ఆముదము, కంది, సజ్జలువంటి విత్తనాలను అధికారులు వ్యవసాయ శాఖ కేంద్రంలో విక్రయాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో చర్చించి పలు అంశాలను తెలుసుకున్నారు.

ఇందులో భాగంగానే నకిలీ విత్తనాల కొనుగోలుపై కూడా ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచనలు చేశారు. లూజు లేదా నకిలి మూటల్లో కట్టినటువంటి విత్తనాలను కొనుగోలు చేయడం ద్వారా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు.

విత్తనాలను కొనుగోలు చేసే ముందు సంబంధిత కంపెనీకి సంబంధించిన రిసీదును తీసుకోవాలని కేవలం పాకెట్లలో సీజ్ చేసిన వంటి విత్తనాలను మాత్రమే తీసుకోవాలని తెలిపారు. విత్తనాల కొనుగోలు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించిన కానీ పంట ఎదుగుదలపై వాటి ప్రభావం చూపి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

గ్రామీణ స్థాయిలో అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకొని విత్తనాలను సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ ఎప్పుడు రైతులకు అందుబాటులోని ఉంటుందని ఎలాంటి సందేహాలు వచ్చిన అధికారులను అడిగి తెలుసుకుని సాగు చేయడం ద్వారా శాస్త్ర సాంకేతిక పద్ధతులను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చని సూచించారు.

First published:

Tags: Agriculture, Fake seeds, Local News, Mahabubnagar, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు