హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: షేర్ మార్కెట్ పెట్టుబడులు పేరుతో 15 కోట్లతో ఉడాయించిన యువకుడు

Nagar Kurnool: షేర్ మార్కెట్ పెట్టుబడులు పేరుతో 15 కోట్లతో ఉడాయించిన యువకుడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: మహబూబ్నగర్ మున్సిపాలిటీపరిధిలోని ఎదిర గ్రామానికి చెందిన ఓ యువకుడు 2014 నుంచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పలువురికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తాను మంచి లాభాలు గడిస్తున్నాయని చెబుతూ వచ్చాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

మహబూబ్నగర్ మున్సిపాలిటీపరిధిలోని ఎదిర గ్రామానికి చెందిన ఓ యువకుడు 2014 నుంచి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పలువురికి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తాను మంచి లాభాలు గడిస్తున్నాయని చెబుతూ వచ్చాడు. మొదట్లో పెద్దగా నమ్మకపోయినప్పటికీ తన ప్రయత్నాలను విరమించుకోకుకుండా సాగించాడు.

ఒకటి రెండు సంవత్సరాల్లో కారు కొనడం కుటుంబంతో కలిసి లగ్జరీ జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో స్నేహితులు, బంధువులు ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. వారికి ఒక్కరికి ప్రతినెల నూటికి ఐదు నుంచి పది రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తితో తీసుకున్న డబ్బుల విషయంలో మరొకరికి తెలియకుండా పెట్టుబడులతో పేరుతో వసూలు చేశాడు.

గ్రామస్తులందరికీ నమ్మకం కలగడంతో ఒకరి తెలియకుండా మరొకరి దగ్గర నుంచి లక్ష నుంచి 40 లక్షల వరకు 70 మంది దగ్గర దాదాపు 9 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తుంది. వీరితోపాటు అప్పన్నపల్లి వీరన్నపేట ప్రాంతాల్లోనూ మరి కొంతమంది దగ్గర ఆరుకోట్లపైగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో తీసుకున్నట్లు సమాచారం. గత మూడు నెలల నుంచి పెట్టుబడి పెట్టిన వారి వడ్డీలు, డబ్బులు ఇవ్వకపోవడంతో ఫోన్లు ఎత్తకపోవడంతో పెట్టుబడిదారులు అతన్నీ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. వీరన్న పేటకు చెందిన ఒక వ్యక్తి తనకు చెల్లించాల్సిన 63 లక్షలకు సంబంధించిన ఇంట్రెస్ట్ రాకపోవడంతో యువకుడిని పట్టుకుని బెదిరించి తనకు రావలసిన డబ్బులతో సగానికి పైగా రాబట్టుకున్నట్టు తెలిసింది.

మొత్తానికి పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన ఆ యువకుడు తన భార్య బిడ్డలతో కలిసి సంక్రాంతి పండగ సమయంలో పరార్ అయ్యారని సమాచారం. ఫోన్ స్విచాఫ్ ఉండడంతో ఏం చేయాలో తోచక బాధితులు తలలు బాదుకుంటున్నారు. సులభంగా డబ్బులు వస్తాయని భావించి తక్కువ వడ్డీలకు లక్షల్లోఅప్పులు చేసి ఎక్కువ వడ్డీకి ఇచ్చి ఇప్పుడు వాపోతున్నారు. బాధితులలో మహిళలు, ఉద్యోగులు, వ్యాపారస్తులతో పాటు కూలి పనులు చేసుకునే వారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై మహబూబ్నగర్ పోలీసులు వివరణ కోరగా.. సంఘటన జరిగిందని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయడం లేదని వివరించారు.

First published:

Tags: CYBER FRAUD, Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు