హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad story: ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు.. వారి బంధాన్ని పెద్దలు ఒప్పుకోలేదని యువకుడు ఎంత పని చేశాడంటే..

Sad story: ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు.. వారి బంధాన్ని పెద్దలు ఒప్పుకోలేదని యువకుడు ఎంత పని చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి (Love marriage) చేసుకున్నారు. పెద్దలకి ఇష్టం లేకుండా దూరంగా ఉన్నారు. వారిద్దరిని పిలిచి పెళ్లి చేస్తామని నమ్మించి ఇద్దరినీ విడదీశారు. దానితో ..

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

(Sayyad Rafi, News18, Mahbubnagar)

వారిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి (Love marriage) చేసుకున్నారు. పెద్దలకి ఇష్టం లేకుండా దూరంగా ఉన్నారు. వారిద్దరిని పిలిచి పెళ్లి చేస్తామని నమ్మించి ఇద్దరినీ విడదీశారు. దానితో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. వారిద్దరిదీ ఒకే గ్రామం, ఒకే కులం. వరసకు బావ మరదలు ఇద్దరి మధ్య చనువు ప్రేమగా మారింది. వారి బంధాన్ని పెద్దలు నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన ప్రియుడు రాత్రి మధ్యలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనపై గ్రామస్తులు కుటుంబ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి మహబూబ్​నగర్​ (Mahbubnagar) జిల్లా విప్పనగండ్ల మండలం గోపాల్ దీన్నే గ్రామానికి చెందిన శ్రీనివాసులు లక్ష్మీ దంపతుల కుమారుడు శ్రీకాంత్ యాదవ్ (23 సంవత్సరాలు). 10 వరకు చదివి ఇంటిలోనే ఉంటున్నాడు. నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి అమ్మమ్మ గారి ఊరైన గోపాల్ దీన్నే గ్రామంలో ఉంటోంది.  వనపర్తి జిల్లా కేంద్రంలోని ఒక కళాశాలలో డిగ్రీ ప్రధమ సంవత్సరం చదువుతుంది. గోపాల్ దీన్నే లో వీరి ఇల్లు పక్కపక్కనే ఉండటంతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది.

యాదాద్రి వెళ్లి వివాహం..

ఈ విషయం తెలిసి ఇరువర్గాల పెద్దలు వారిని హెచ్చరించడంతో మూడు రోజుల క్రితం యాదాద్రి వెళ్లి వివాహం చేసుకున్నాడు. ప్రేమికులు పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకున్న కుటుంబ పెద్దలు ఇంటికి వచ్చేస్తే పెద్దగా పెళ్లి చేస్తామని నమ్మించడంతో వారిద్దరు గ్రామానికి వచ్చేశారు. వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరు పట్టణంలో మార్కెట్ యార్డులు ఇరువర్గాల పెద్దలు చర్చలు జరిపారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించగా యువకుడికి ఉన్నత చదువు లేదని యువతి తల్లి అడ్డు చెప్పి కూతుర్ని వెంటబెట్టుకొని ఇంటికి వెళ్లిపోయింది.

మృతుడు శ్రీకాంత్​ (ఫైల్​)

ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన యువకుడు పెబ్బేర్ మార్కెట్ యార్డులోని మద్యం లో పురుగుల మందు కలుపుకొని తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులు స్నేహితులు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన వారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు. ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Lovers suicide, Mahbubnagar, Nagarkurnool