హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: మోటార్​ పనిచేయడం లేదని పొలం దగ్గరికి వెళ్లిన రైతు.. అంతలోనే ఊహించని ఘటన

Nagarkurnool: మోటార్​ పనిచేయడం లేదని పొలం దగ్గరికి వెళ్లిన రైతు.. అంతలోనే ఊహించని ఘటన

నాగర్​కర్నూల్​ వార్తలు

నాగర్​కర్నూల్​ వార్తలు

విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కరెంట్ షాక్‌తో కౌలు రైతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (Naveen Kumar, News18, Nagarkurnool)

  వనపర్తి (Vanaparti) జిల్లా ఆత్మకూరు మండలంలో కరెంట్ షాక్‌తో కౌలు రైతు మృతి (Farmer died) చెందిన ఘటన చోటుచేసుకుంది. తుంపల్లి గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇచ్చిగుంట్ల పరమేష్ (28) 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పొలంలో విద్యుత్ మోటార్ పనిచేయడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేర్ చేస్తుండగా ఎర్తింగ్ రావడంతో విద్యుత్ షాక్ తగిలి పరమేష్ మృతి చెందాడు. చీకటిపడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో భార్య శారద పొలానికి వెళ్లి చూడడంతో అప్పటికే పరమేష్ మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  గణపతి విగ్రహం చోరి: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో ఓ దుకాణంలో వినాయకుడి విగ్రహం (Ganesh Statue) చోరీకి గురైంది. బాధితుడి వివరాలు మేరకు అలంపూర్ మండల పరిధిలో లింగన్నవాయి గ్రామానికి చెందిన కురుమయ్య అలంపూర్ చౌరస్తాలో వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కేంద్రంలో మొత్తం 45 విగ్రహాలుఉండగా ఆగష్టు 31 తేదీ నాటికి 43 విగ్రహాలు విక్రయించాడు కురుమయ్య. మిగిలిన 2 విగ్రహాల్లో ఒకదానిని అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.విగ్రహం విలువ రూ.12,000 ఉంటుందని, ఎత్తుకెళ్లిన వారు కనీసం సగం డబ్బులైనా వేయాలని కురుమయ్య విజ్ఞప్తి చేశారు.

  చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి:

  వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామానికి చెందిన ఆనంద్ (36) రంగసముద్రంలో చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువకుడి కుటుంబం అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానస్పద మృతి కిందకేసు నమోదుచేసి మృత్ దేహాన్ని పోస్టుమార్టంకి పంపారు. బీ పోస్ట్మార్టం అనంతరం ఉదయాన్నే గ్రామానికి తీసుకురాగా గ్రామస్తులు పంచాయతీ వద్ద శవాన్ని నిలిపివేసి రాస్తారోకోకిదిగారు.ఎస్సై మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతోగ్రామస్తులు ఆందోళన విరమించుకున్నారు.

  Nirmala Sitaraman: రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు.. ఒక్కొక్కరిపై రూ.లక్ష అప్పు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​

  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఆక్సిజన్ అందక రోగి మృతి చెందింది. బాధితుల కథనం మేరకు జిల్లాలోని మాల్డాకల్ మండలం నాగర్ దొడ్డికి చెందిన బతుకమ్మ (65) వారం రోజుల క్రితం ఆయాసంగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ఆక్సిజన్ పై ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున 1:40 గంటలకు ఆసుపత్రిలో కరెంట్ పోయింది. ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ వినియోగించడం లేదు. ఈక్రమంలో ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బంది స్పందించకపోవడంతో ఆక్సిజన్ అందక బతుకమ్మ మృతిచెందినది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmer, Local News, Nagarkurnool

  ఉత్తమ కథలు