Home /News /telangana /

NAGAR KURNOOL A STUDENT WHO BROKE HIS LEG OVER BIRYANI KILLED A YOUNG MAN FOR NOT PAYING HIS LOAN NNK BRV ABH

Nagarkurnool: అప్పు తిరిగి చెల్లించలేదని యువకుడి హత్య!..

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని యువకుడినిస్నేహితుడే దారుణంగా హత్య చేసిన ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది

తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని యువకుడినిస్నేహితుడే దారుణంగా హత్య చేసిన ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది

అప్పు తిరిగి చెల్లించలేదని స్నేహితుడి హత్య, బాలికపై యువకుడు అత్యాచారం, బిర్యానీ కోసం కాలు విరగొట్టుకున్న విద్యార్థి

    (N.Naveen Kumar, News 18 , Nagarkurnool)

    తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని యువకుడినిస్నేహితుడే దారుణంగా హత్య చేసిన ఘటన జోగులంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... గద్వాల జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన సాయికుమార్ (20) శ్రీకాంత్ స్నేహితులు. సాయికుమార్ కొన్ని రోజుల క్రితం శ్రీకాంత్ వద్ద రూ.25000 అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో తరచూ ఇద్దరు గొడవపడ్డారు. రెండు నెలల క్రితం రాయలంపాడు రిజర్వాయర్ సమీపంలో మద్యం సేవించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అప్పు విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో రగిలిపోయిన శ్రీకాంత్, సాయికుమార్ తలపై బీరు సీసాతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో పూడ్చిపెట్టి ఇంటికి చేరుకున్నాడు. అప్పటినుంచి సాయికుమార్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గద్వాల ధరూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయికుమార్ స్నేహితులపై నిఘా ఉంచగా శ్రీకాంత్ పై అనుమానం రావడంతో అతన్ని పిలిచి విచారించారు. తాను సాయికుమార్‌ను హత్య చేసినట్టు పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు శ్రీకాంత్. అనంతరం సాయికుమార్ మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. స్నేహితుడే తమ కుమారుడిని పొట్టన పెట్టుకున్నాడని తెలిసి సాయికుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సాయికుమార్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

    బాలికపై అత్యాచారం: పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్తున్న బాలికను తెలిసిన వ్యక్తి బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వనపర్తి ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఓ విద్యార్థిని పుస్తకాలు కొనుక్కోవడానికి ఈనెల 16న తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆటో కోసం ఎదురు చూస్తుండగా.. ఇంతలో తనకు తెలిసిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని బాలికను అడిగాడు. కొత్త పుస్తకాలు తెచ్చుకోవడానికి మా అమ్మ పనిచేసే చోటుకు వెళ్తున్నాని బాలిక చెప్పగా, తాను కూడా అటువైపే వెళ్తున్నాని అక్కడ దించి వెళ్తానని నమ్మించాడు. అనంతరం బాలికను చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి, ఆ బాలికను ఇంటి దగ్గర దిగబెట్టాడు. జరిగిన విషయాన్నీ బాలిక తన తల్లితో చెప్పడంతో వారు జులై 20న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

    బిర్యానీ కోసం కాలు విరగొట్టుకున్న విద్యార్థి:
    బిర్యానీ కోసం ఇద్దరు హాస్టల్ విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణలో ఒక విద్యార్థి కాలు విరగొట్టుకున్నాడు. ఈఘటన అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్‌లో చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ రాములు తెలిపిన వివరాలు ప్రకారం బలుమూరు మండలం గత్తుతుమ్మన్ గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు అరుణ్, అమ్రాబాద్ మండలం పల్లి గ్రామానికి చెందిన చారగొండ రామస్వామి కుమారుడు రాజేష్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం మల్లయ్య బిర్యానీ తెచ్చి కుమారుడు అరుణ్‌కు ఇచ్చాడు. దాన్ని అతడు తన పెట్టెలో పెట్టుకొని బయటికి వెళ్లాడు. ఇంతలో బిర్యానీ ప్యాకెట్ గమనించిన అరుణ్ స్నేహితుడు రాజేష్, ఆ ప్యాకెట్ తీసుకొని పాఠశాల భవనం మొదటి అంతస్తుకి వెళ్ళాడు. అనంతరం వచ్చిన అరుణ్ పెట్టెలో బిర్యానీ లేకపోవడంతో అనుమానం వచ్చి భవనం పైకి వెళ్లాడు. అక్కడ రాజేష్ దగ్గర బిర్యానీ ప్యాకెట్ కనిపించడంతో తీసుకునేందుకు అతని వెంటపడ్డాడు. అరుణ్‌కు దొరక్కుండా పరిగెత్తిన రాజేష్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అంబులెన్సులో రాజేష్‌ను అచ్చంపేట సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కాలు విరిగిందని కొంతమేర పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు