హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: కంటి వెలుగు చికిత్సకు వచ్చాడు.. కానీ మరణం వెంటాడింది

Nagar Kurnool: కంటి వెలుగు చికిత్సకు వచ్చాడు.. కానీ మరణం వెంటాడింది

కంటి వెలుగులో విషాదకర ఘటన

కంటి వెలుగులో విషాదకర ఘటన

Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభమయింది. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు డివిజన్లో పరిధిలో 531 లోకేష్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నేడు ప్రారంభమయింది. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు డివిజన్లో పరిధిలో 531 లోకేష్లలో కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినకంటి వెలుగు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి ప్రారంభం చేపట్టారు.

అయితే ఈ కార్యక్రమం మొదటి రోజునే అపశృతి చోటుచేసుకుంది. కంటి వెలుగు కార్యక్రమంలో కంటికి చికిత్స చేసుకునేందుకు వచ్చినటువంటి వ్యక్తి మృతి చెందడం కలకలం రేగుతుంది. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశీ ఇటిక్యాల ఏరియాలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కంటి పరీక్షల నిమిత్తం వచ్చిన మౌలాలి (40) కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మౌలాలికి ఫీట్స్ వచ్చి కింద పడిపోవడం జరిగింది. వైద్య సిబ్బంది ప్రాథమికంగా పరీక్షించి అతనిని 108 వాహనంలో నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోగా పరిస్థితి విషమించింది. అప్పటికే మౌలాలి మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కంటి వెలుగు మొదటి రోజున అపశృతి చోటు చేసుకోవడంతో దేశీ ఇటికాల గ్రామంలో ప్రజలు కంటి వెలుగు ద్వారా చికిత్సలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

అయితే.. అది వైద్యం వికటించి కాదు.. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా జరిగిందని సిబ్బంది దైర్యం చెప్తున్నారు. ఇదిలా ఉండగా నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కూడా కంటి వెలుగు కార్యక్రమంలో చికిత్సలు చేయించుకునేందుకు ప్రజలు బారులు తీరినపరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ప్రభుత్వ అధికారులు గ్రామాల వారీగా ప్రచారం నిర్వహించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు చికిత్సలు చేయించుకునేందుకు కంటి వెలుగు కేంద్రాల దగ్గర క్యూ కట్టారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు