రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
వేసవికాలం సమీపించక ముందే నల్లమల అటవీ ప్రాంతంలో ఇప్పటికే జరగరాని ప్రమాదం జరిగిపోయింది. అటవీ ప్రాంతంలో నిప్పురవ్వలు రాజుకొని అటవీ అంత దహించుకుపోయింది. గత వారం రోజుల్లో రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతున్నాయి. భవిష్యత్తులో వేసవిలో ఎండలు మరింత తీవ్రంగా కానున్నాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాలు పెరగవచ్చు అనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.
అయితే ప్రకృతి సిద్ధంగా ఏర్పడే అగ్ని ప్రమాదాల కంటే మానవ తప్పిదాల వలన ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్టుగా అడవి శాఖ అధికారులు గుర్తించారు. శ్రీశైలం క్షేత్రానికి దర్శనానికి వెళ్లేటువంటి భక్తులు అటవీ మార్గం కుండా వెళ్లి అక్కడే అడవిలో వంటా వార్పు లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అప్పుడు వెలిగించిన మంటలు సరిగ్గా ఆర్పీ వేయకపోవడం వలన ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ తలమానికంగా నిలిచిన నల్లమల్ల అభయారణ్యం సుమారు 2,496 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పెద్దపులులకుసంరక్షణ కేంద్రంగా విస్తరించి అడ్డగా మారుతుంది.అయితే వేసవిలో అటవీ ప్రాంతానికి ప్రతీ ఏటా ముప్పు వాటిల్లుతుంది.చెట్ల నుంచి రాలిపడే ఎండుటాకులు, దట్టంగా పెరిగే ఎండు గడ్డితో చిన్నపాటి నిప్పురవ్వలు సైతం క్షణాల్లో కార్చిచ్చులా మారి వృక్ష సంపదను దహించి వేస్తుంది. మానవ తప్పిదాల కారణంగా ప్రతి ఏటా ఇలాంటి ఘటనలు చేసుకోవడం వందలాది ఎకరాల్లో కారడివి బుగ్గిపాలు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈసారి వేసవికి ముందే, పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే అమూల్యమైన అటవీ సంపదతో పాటు వన్య ప్రాణులు కారు చిచ్చుకు బలయ్యే ప్రమాదం ఉంది.
ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో రెండుసార్లు ఈ ఏడాది కార్చిచ్చు రేగింది.గతవారం రోజుల్లోనే నల్లమల్లలో దోమల పెంట కేంద్రం సమీపంలోని తోసిపెంట వద్ద అడవిలో కార్చిచ్చు చెలరేగింది. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన సుమారు మూడు హెక్టార్ల వరకు వన్య సంపద అగ్నికి ఆహుతయింది. వెంటనే రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శ్రీశైలం యాత్రికులు వంట చేసుకున్న తర్వాత మంటలు ఆర్పకపోవడం వలనేఅడవిలో అగ్నిప్రమాదంకుకారణమవుతుందని అధికారులు నిర్దారిస్తున్నారు. గత వేసవిలో కొల్లాపూర్ ప్రాంతంలోని ఎద్దుల బండ సమీపంలో అడవిలో చెరగని మంటలు వ్యాపించి లింగాల మండల మషమ్మ చెరువు వరకు విస్తరించింది. వేలాది ఎకరాల్లో అటవీ సంపద కాలి బూడిదయింది.
నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉ హైదరాబాద్ శ్రీశైలం రహదారి వెంట యాత్రికులు రాజేసిన నిప్పు వలన అగ్రి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇది వన్యప్రాణులకు ముప్పుగా మారుతుంది. మానవ నిర్లక్ష్యం లేదా మరేదైనా కారణం వలన అటవీ ప్రమాదం చోటు చేసుకుంటూ అడవిలో ఏళ్లనాటి చెట్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. చెట్లు ఖాళీ బూడిద కావడంతో వన్యప్రాణాల సైతం మంటల్లో చిక్కుకొని చనిపోతున్నాయి.
నల్లమల్ల అటవీ ప్రాంతంలో 2,496 కిలోమీటర్లు విస్తరించి ఉండగా.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధి ఒక 1750 కిలోమీటర్ల విస్తరించి ఉంది. మొత్తం ఫారెస్ట్ బ్లాకులు 25 ఉండగా బఫర్ జోన్లు 445.30 కిలోమీటర్లు ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా 301 చదరపు కిలోమీటర్లు ఉంది. అయితే నల్లమల్ల అటవీ ప్రాంతంలో పర్యాటకులుఎలాంటి వంటలు చేయకుండా ఫారెస్ట్ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు. అడవిలో వంటలు వండటం వలన ఆ నిప్పును సరిగా ఆర్పకపోవడం వలన ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. వీటికిగాను పెనాల్టీలు వేసేందుకు కూడా అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana