హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఈయన రిపేర్ చేయని ఆయిల్ ఇంజిన్ లేదు: 1945 నుంచి మెకానిక్‌గా చేస్తున్న 94 ఏళ్ల వృద్ధుడు 

Nagarkurnool: ఈయన రిపేర్ చేయని ఆయిల్ ఇంజిన్ లేదు: 1945 నుంచి మెకానిక్‌గా చేస్తున్న 94 ఏళ్ల వృద్ధుడు 

Senior

Senior Mechanic

Nagarkurnool: ఉమ్మడి పాలమూరు మొదటి ఇంజనీరింగ్ వర్క్ షాప్ అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షాప్ నిరంతరం పనిచేస్తూనే ఉంది. అక్కడ విశేషమేమంటే ఆ షాప్ పెట్టిన నాటి నుంచి నేటి వరకు మెకానిక్‌గా ఆయన పనిచేస్తున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N.Naveen Kumar,News18,Nagarkurnool)

  ఉమ్మడి పాలమూరు మొదటి ఇంజనీరింగ్ వర్క్ షాప్(Engineering shop)అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షాప్ నిరంతరం పనిచేస్తూనే ఉంది. అక్కడ విశేషమేమంటే ఆ షాప్ పెట్టిన నాటి నుంచి నేటి వరకు మెకానిక్‌(Mechanic)గా ఆయన పనిచేస్తున్నాడు. 1945లో ఉమ్మడి పాలమూరు(Palamuru)జిల్లాలోనే మొదటి ఇంజనీరింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేశాడు వీరశేఖరాచారి(Veerasekharachari).94 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆసకక్తిగా ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్న వీరశేఖరాచారి తాను రిపేర్ చేయని ఆయిల్ ఇంజన్ లేదని అంటున్నారు.

  Telangana : ఇకపై గర్భిణులకు సిజేరియన్ చేస్తే అంతే సంగతులు .. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక తనిఖీలు

  చేయి తిరిగిన పనోడు..

  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దాదాపు 80 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ షాప్‌ను ఏర్పాటు చేసి అన్ని రకాల ఆయిల్ ఇంజన్ పనులను ప్రారంభించాడు వీరశేఖరాచారి. ఎలాంటి ఇంజనీరింగ్ చదువు లేకుండా ఉర్దూ మీడియంలో 4వ తరగతి వరకు చదువుకున్న వీరశేఖరాచారి... ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఇంజనీర్‌గా పేరుకెక్కారు. కల్వకూర్తి నియోజకవర్గంలోని రఘుపతిపేట గ్రామాని చెందిన వీరశేఖరాచారి జీవనోపాధి నిమిత్తం నాగర్‌కర్నూల్ పట్టణానికి వలస వచ్చారు. ప్రస్తుతం 95 ఏళ్ల వయసున్న వీరశేఖరాచారి చిన్నతనంలో తన అన్న దగ్గర కార్పెంటర్ పని చేసుకుంటూ కొన్నాళ్ళు జీవనం కొనసాగించారు. ఆ కాలంలో నాగర్‌కర్నూల్ పట్టణంలో ప్రజలు ఆయిల్ ఇంజనీరింగ్ పనులకు, వర్క్ షాపు పనులకు హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో ఇంజనీరింగ్ వర్క్ నేర్చుకోవాలనే ఆసక్తితో వీరశేఖరాచారి తన 18 ఏళ్ల వయసులో సికింద్రాబాద్‌కు చెందిన బాలాజీ సింగ్ అనే ఇంజనీర్ వద్ద కొంత కాలం వర్కర్‌గా చేరి పని నేర్చుకున్నాడు. ఎంతో ఏకాగ్రతతో అనతి కాలంలోనే చాలా వరకు ఇంజనీరింగ్ పనులు నేర్చుకున్నాడు.

  80ఏళ్లుగా ఫేమస్ మెకానిక్‌గా పేరు..

  ఏ మిషన్ అయినా సరే ఒక్కసారి చూస్తే ఇట్టే బాగుచేయగల సామర్ధ్యాన్ని సంపాధించుకున్న వీరశేఖరాచారి ఆ తరువాత నాగర్‌కర్నూల్ వచ్చి మొట్టమొదటిసారిగా శ్రీ వెంకటరమణ ఆయిల్ ఇంజనీరింగ్ వర్క్ షాపును ప్రారంభించాడు. అప్పటి నుంచి నేటి వరకు నాగర్‌కర్నూల్ ప్రాంతంలో వీరశేఖర్ ఇంజనీరింగ్ వర్క్ షాపు గురించి తెలియనివారు లేరు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని వాహనాలు ఆయిల్ ఇంజన్ వర్క్స్ కోసం వీరశేఖర్ వద్దకే వచ్చేవారు. ఆ క్రమంలో తన వద్దకు వచ్చే ఇంజన్లను బాగు చేసేందుకు అత్యంత ఖరీదైన యంత్రాలు కొనుగోలు చేసే శక్తి లేక, ఆ యంత్రాన్ని చూసి తానే స్వయంగా తయారు చేసుకున్న ప్రతిభావంతుడు వీరశేఖరాచారి.

  Hyderabad : 17లక్షలు చెల్లిస్తేనే చికిత్స లేదంటే డిశ్చార్జ్..కార్పొరేట్ ఆసుపత్రిపై రోగి బంధువులు ఆగ్రహం

  గ్రేట్ పర్సన్..

  కాలక్రమేణా బ్యాంక్ పని నిమిత్తం వెంకటరమణ ఇంజనీరింగ్ వర్క్ షాపు పేరును రమాకాంత్ ఇంజనీరింగ్ వర్క్ షాపుగా మార్చారు. 1972లో నాగర్‌కర్నూల్ నుంచి అమెరికా వెళ్లిన వీరశేఖర్... ఆధునిక పద్ధతుల్లో ప్రౌల్ట్రీ షెడ్ నిర్మాణం ఎలా చేపట్టాలో పనులను నేర్చుకొని వచ్చాడు. పాలెం గ్రామంలోని పాలెం సుబ్బయ్యతో పాటు అమెరికాకు వెళ్లి అప్పటికే అభివృద్ధి చెందిన ఇంజనీరింగ్ పనులను నేర్చుకున్నాడు. ఇప్పటికీ వీరశేఖర్ తన ఇంట్లోని చిన్నచిన్న వస్తువులను రిపేర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వర్క్ షాపును ఆయన కుమారుడు రమాకాంత్ నిర్వహిస్తున్నాడు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana News

  ఉత్తమ కథలు