Home /News /telangana /

NAGAR KURNOOL 40 DAYS AFTER LOVE MARRAIGE YOUTH COMMITTED SUICIDE DUE TO THREATENS FROM GIRL SIDE IN MAHABUBNAGAR NNK BRV PRV

Nagarkurnool: కోరుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు: కానీ, పెళ్ళైన 40 రోజులకే ఊహించని ఘటన

యువకుడిపై ఆత్మహత్యపై విచారణ చేస్తున్న పోలీసులు

యువకుడిపై ఆత్మహత్యపై విచారణ చేస్తున్న పోలీసులు

మహబూబ్‌నగర్ (Mahbubnagar) మండలం మాచన్పల్లికి చెందిన బి కృష్ణ (21) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. జూన్ 27న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 40 రోజులకే ఊహించని సంఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N. Naveen kumar, News 18, Nagarkurnool)

    ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న (Love marriage) ఓ యువకుడు పెళ్ళైన 40 రోజులకే ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మృతుడి అన్న నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ (Mahbubnagar) మండలం మాచన్పల్లికి చెందిన బి కృష్ణ (21) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. జూన్ 27న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. నెల రోజుల సమయం ఇస్తే తాము కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేస్తామని అమ్మాయి బంధువులు పోలీసులు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం యువతిని ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి యువతిని ఇంట్లో నిర్బంధించి కృష్ణను వేధించసాగారు. తమ అమ్మాయిని మర్చిపోవాలని కృష్ణపై దాడి చేశారు. దీంతో యువతీ బంధువుల వేధింపులు తట్టుకోలేక కృష్ణ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

    Peddapalli: దేవుడు లేని గుడి: అయినా అక్కడికి ప్రజలు ఎందుకు బారులు తీరుతున్నారు?

    లారీ బైక్ ఢీకొని మహిళ మృతి;

    మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి స్టేషన్ సమీపంలో శుక్రవారం లారీ.. బైక్ ఢీకొన్న ఘటనలో (Road Accident) రమాదేవి (24) అనే వివాహిత మృతి చెందినట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. రాజాపూర్‌కు చెందిన ఆకుల నాగరాజు తన భార్య రమాదేవితో కలిసి అనారోగ్యంతో ఉన్న కుమార్తె నవ్యశ్రీ (10 నెలలు) చికిత్స కోసం జడ్చర్లకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. చికిత్స అనంతరం తిరిగి రాజాపూర్‌కు వెళుతుండగా గొల్లపల్లి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. ఈప్రమాదంలో నాగరాజుతో పాటు పాప నవ్యశ్రీకి గాయాలు కాగా రమాదేవి అక్కడిక్కడే మృతి చెందింది. నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



    ఆస్పత్రి ఎదుట ఆందోళన:

    మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి చెందిన హుసేనమ్మ (45) ఇంటి ఆవరణలో కొళాయి దగ్గర జారీ పడడంతో కాలు విరగడంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. హుసేనమ్మను పరిశీలించిన వైద్యులు చికిత్స చేయాలని సూచించడంతో బుధవారం ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఐసీయులోకి మార్చి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మరణించింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు