హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదానికి రెండేళ్లు: ఆ రోజు ఏం జరిగింది?

Nagarkurnool: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదానికి రెండేళ్లు: ఆ రోజు ఏం జరిగింది?

శ్రీశైలం ప్రమాదం

శ్రీశైలం ప్రమాదం

శ్రీశైలం (Srisailam) ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో (Power palnt) జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire accident) దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2020 ఆగస్టు 20న చోటుచేసుకున్న ఘటనతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen kumar, News 18, Nagarkurnool)

  రెండేళ్ల క్రితం శ్రీశైలం (Srisailam) ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో (Power palnt) జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire accident) దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2020 ఆగస్టు 20న చోటుచేసుకున్న ఘటనతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది విద్యుత్ కేంద్ర సిబ్బంది మృతి చెందగా రూ. కోట్ల నష్టం వాటిల్లింది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో జరిగిన ఈప్రమాదం తాలూకు నీలినీడలు నేటికీ సిబ్బందిని వెంటాడుతూనే ఉన్నాయి. ఆరోజు జరిగిన భయానక ప్రమాదంలో కోల్పయిన సహోద్యుగులను తలచుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.

  దేశమంతా ఒక్క సరిగా ఉలిక్కిపడిన ఘటన: చరిత్రలో ఎప్పుడు ఎరుగని ప్రమాదం... ఊహించని పెను విపత్తు శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది. 2020 ఆగస్టు 20న జరిగిన ఈ ప్రమాదంను గుర్తు చేసుకొని విద్యుత్ ఉద్యోగులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఆ దుర్ఘటనను తలచుకుని ఇప్పటికి వణికిపోతున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించింది. ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు గల పవర్ హౌస్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి పవర్ హౌస్ అంతట మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో దాదాపు 30 మంది సిబ్బంది నైట్ షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నారు. మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాప్తి చెందడంతో లోపల ఉన్న సిబ్బందికి శ్వాస అందలేదు. దట్టమైన పొగ కారణంగా బయటకు వచ్చే దారి కనిపించలేదు.

  విధి నిర్వహణలో..

  ఇంతలో మంటల వ్యాప్తిని అరికట్టేందుకు పవర్ హౌస్ షట్టర్లు మూసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన డిఈ శ్రీనివాస్ గౌడ్, ఏఈలు మోహన్ కుమార్, ఉస్మా ఫాతిమా, పాల్వంచకు చెందిన ఏఈ వెంకట్రావు, సూర్యాపేటకు చెందిన సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు కిరణ్, అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన ఎంప్లాయి వినేష్ కుమార్, మహేష్ కుమార్లు మృతి చెందారు. వారితో పాటు విధి నిర్వహణలో ఉన్న అంకినీడు కమలాకర్, కృష్ణ రెడ్డి, మాతృనాయక్, వెంకట్రావు, నాగులు వెంకటయ్య, మోటిలాల్, మోజేష్, జయ బాబు, మహబూబ్, రవీందర్ రెడ్డి ఎమర్జెన్సీ మార్గం గుండా అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు.

  తమతో చివరి క్షణాలు పంచుకున్న సహ ఉద్యోగుల మరణగోష ఇప్పటికీ వారిని వెంటాడుతోంది. ప్రమాదం జరిగి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యోగులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేయగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమై మాటలు రాలేక సహోద్యోగులను తలచుకొని మౌనంగా రోదించారు. ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న 150 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేశామని చెప్పారు. నాలుగో యూనిట్లో మరో 3 నెలలో పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్పారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Died, Local News, Nagarkurnool, Srisailam Power Station Mishap

  ఉత్తమ కథలు