హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న 120 మంది రైతులు!..

ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న 120 మంది రైతులు!..

వ్యవసాయంలో ఐక్యత చూపిస్తున్న కుటుంబం

వ్యవసాయంలో ఐక్యత చూపిస్తున్న కుటుంబం

Telangana: సాధారణంగా ఉమ్మడి కుటుంబంలో వారంతా అన్నదమ్ములు వేరు కాపురాలు పెట్టుకోకుండా తమకున్న భూమిని అందరూ కలిసి ఒకే దగ్గరే ఉంటూ ఉమ్మడి కుటుంబంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సాధారణంగా ఉమ్మడి కుటుంబంలో వారంతా అన్నదమ్ములు వేరు కాపురాలు పెట్టుకోకుండా తమకున్న భూమిని అందరూ కలిసి ఒకే దగ్గరే ఉంటూ ఉమ్మడి కుటుంబంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనలు చాలానే చూస్తూ ఉంటాం. కానీ ఒక గ్రామం మొత్తం ఉమ్మడిగా ఉంటూ తమకున్న 86 ఎకరాల భూమిని ఉమ్మడిగా సాగు చేయడాన్ని ఎక్కడా చూసి ఉండరు.

ఇలాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలంలోని ఈడుగోని పల్లి గ్రామంలో దశాబ్దాల కాలంగా చోటు చేసుకుంటూ వస్తుంది. ఈ గ్రామంలోని 86 ఎకరాల ఉమ్మడి భూమిని 120 మంది రైతులు కలిసి 52 సంవత్సరాలుగా ఉమ్మడి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. ఊళ్లో పొలం సేద్యం చేయాలన్నా, దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా రైతులందరూ ఏకతాటిపై నిలబడి వ్యవసాయ పనులు చేస్తారు.

ఎక్కడైనా వారసత్వంగా వచ్చిన భూములను పంపకాలు చేసుకుంటారు. కానీ ఈడుగోని పల్లి గ్రామంలో 120 మంది రైతులు తమకున్న 86 ఎకరాల ఉమ్మడి భూమిని కలిసికట్టుగా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమిలోనే పశుగ్రాసాన్ని నిలువ చేసుకునేందుకు ఇతర అవసరాల కోసం గ్రామ కంఠంగా కొంత భూమిని మార్చారు.

మిగిలిన 65 ఎకరాల భూమి రైతుల పేరిట ఆర్ఓఆర్ లో నమోదు చేయించారు. కనీసం ఎవరి హద్దులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. 52 ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే సంస్కృతి. నాటి నుంచి అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసి వెలిసి ఉంటూ ఉమ్మడి సేద్యం చేస్తున్నారు. అందుకే తక్కువ ఖర్చుతో పంటలు సాగుచేసి సిరుల పంటలు పండిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

1970 సెప్టెంబర్ 18న గద్వాల దొరలకు చెందిన ఉత్తనూర్ శివారులోని 86 ఎకరాలను ఈడుగోని పల్లి గ్రామానికి చెందిన బడే సాబ్, చిలుక తిప్పన్న, తాటికుంట హుస్సేని, బోయ హనుమక్క, వదులు తిప్పన్న, నక్కల బజారి, నాగప్ప కలిసి 65 వేలకు ఈ భూమిని కొనుగోలు చేశారు. పశుగ్రాసం కోసం నిలువ చేసుకునేందుకు తదితర అవసరాల నిమిత్తం కొంత భూమిని వేరుచేసి గ్రామ కంఠంగా మార్చుకొని వాడుకుంటున్నారు.

మిగిలిన భూమిని గ్రామానికి చెందిన 65 మంది రైతుల పేరుట ఆర్ఓఆర్ లో నమోదు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి ఎవరి హద్దులు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అప్పటినుంచి ఇప్పటివరకు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటూ ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో పప్పుశనగ, జొన్న, కుసుమ, పంటలతో పాటు కలంగిరి, కర్బూజా పండ్లతోటలను కూడా సాగు చేస్తున్నారు. ఉమ్మడి సేద్యం చేయడం వల్ల వ్యవసాయ ఖర్చులు తగ్గి అధిక లాభాలు పొందుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

పొలంలో ఏ పనులు చేయాలన్న తెలిసేందుకు గతంలో దండోరా వేయించేవారు. ప్రస్తుతం గ్రామంలోని శివరామాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న మైకు ద్వారా సమాచారం చేరవేస్తున్నారు. రెండు రోజుల ముందే ఆలయ ప్రాంగణంలో రైతులందరూ సమావేశమై అవసరమైన విత్తనాలను సమకూర్చుకుంటారు. పంటకు ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు ప్రతి రైతు వారికి కేటాయించిన వాటాను జమచేసి ఒకరి వద్ద ఉంచుతారు. పంట చేతికి వచ్చిన తర్వాత అందరూ కలిసి పంటను అక్కడే నూర్పిడి చేస్తారు.

అనంతరం ఎవరి వాటాలు వాళ్ళు వేరుచేసి ఇండ్లకు తీసుకెళ్తారు. ఒక్కోసారి పండ్లతోటలు సాగు చేసేందుకు వ్యాపారస్తులకు భూమిని కౌలుకు ఇస్తారు. వచ్చిన డబ్బులను అందరూ సమానంగా పంచుకుంటారు. అయితే వ్యవసాయ పొలాన్ని కొన్న మొదటిలో 65 మంది రైతుల పేరుట ఉండగా కాలక్రమేన జనాభా పెరగడంతో ఇప్పుడు120 రైతులకు పొలంపై హక్కులు ఉన్నాయి. వ్యవసాయ పనులు చేసేందుకు ఈ 120 మంది రైతుల ఇంటి నుంచి ఒక్కొక్కరుగా పొలానికి వెళ్లి మొత్తం 120 మంది కలిసి పనులు చేస్తారు. కష్టాన్ని, పెట్టుబడులను సమానంగా పంచుకొని పంట అమ్మగా వచ్చిన లాభాలను కూడా సమానంగా పంచుకుంటారు. ఈ సాంస్కృతితో ఈడిగోనిపల్లి రైతుల ఐక్యమత్యం రాష్ట్రవ్యాప్తంగా తెలుస్తుంది.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు