Home /News /telangana /

NAGAR KURNOOL 10TH CLASS STUDENT HANGED FROM A TREE UNDER SUSPICIOUS CIRCUMSTANCES IN MAHABUBNAGAR NNK BRV PRV

Nagarkurnool: అడవిలో చెట్టుకు వేలాడిన బాలిక డెడ్ బాడీ.. మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్..

గ్రామస్తులను విచారిస్తున్న పోలీసులు

గ్రామస్తులను విచారిస్తున్న పోలీసులు

మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని చెట్టుకు ఉరివేసుకొని (Hanging) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India
  (N. Naveen kumar, News 18, Nagarkurnool)

  మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రంలో ఓ విద్యార్థిని చెట్టుకు ఉరివేసుకొని (Hanging) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపి వివరాలు మేరకు మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ కు చెందిన ఓ బాలిక (17) పదవ తరగతి వరకు చదివింది. అదే గ్రామానికి చెందిన ధర్పల్లి వెంకటేష్ అతని అన్న మొగులయ్య ఇద్దరు ఈనెల 15న బాలిక ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో మాయమాటలు చెప్పి ఉదయం 11 గంటల సమయంలో బాలికను బలవంతంగా బైక్ పై తీసుకెళ్లారు. స్థానికంగా నివసించే మరో బాలిక ఇది గమనించి... సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక (Girl) కోసం గాలించిన కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియక పోవడంతో.. అనుమానంతో మొగులయ్యకు ఫోన్ చేశారు. రాత్రి 8 గంటల వరకు బాలికను తీసుకొస్తామని మొగులయ్య కోపంతో చెప్పినట్లు బాధితులు తెలిపారు. ఇంతలో మంగళవారం సాయంత్రం గ్రామ శివారులోని మార్చానుపల్లి వద్ద కానుగ చెట్టుకు ఉరివేసినట్లుగా బాలిక మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని బాలిక మృయితదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వెంకటేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించి తమ కూతురిని హత్య చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.

  రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి:

  నాగర్‌కర్నూలు (NagarKurnool) జిల్లా ఉప్పునుంతల మండలంకు చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చెందాడు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామానికి చెందిన మాచర్ల శంకర్ (33) జీవనోపాధి కోసం హైదరాబాదులో ఉంటున్నాడు. శంకర్ బంధువుల ఇంట్లో వివాహానికి గాను బుధవారం ఉదయం గ్రామానికి వస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం తుక్కుగూడ సమీపంలో డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ ఆకడికక్కడే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.


  అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి:

  జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా గట్టు మండలంకు చెందిన వ్యక్తి ఐజలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గట్టు మండలం తప్పెట్ల మురుసు గ్రామానికి చెందిన బెంజిమెన్ (40)కు ఎక్లాస్‌పురంకు చెందిన కుతుబుద్దీన్‌కు... ఐజ మండలంలోని బండ శివారులో ఉన్న పొలం గురించి గత కొన్నేళ్లుగా తగాదా నడుస్తుంది. ఈక్రమంలో స్థలం గురించి మాట్లాదమంటూ బెంజిమెన్, కుతుబుద్దీన్ మంగళవారం నాడు కలుసుకున్నారు. ఈక్రమంలోనే బుధవారం ఉదయం బెంజిమెన్ మృతదేహం కుతుబుద్దీన్ ఇంటి వద్ద కనిపించడం అనుమానాలకు తావిస్తుంది. బెంజిమెన్ కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Gadwal, Local News, Mahbubnagar, Nagarkurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు